రైల్వే పోలీసు: బైక్‌పై ఎత్తుకెళ్లి రేప్ యత్నం చేశాడు

Railway police resorts to sexual assault
ఒంగోలు/ నల్లగొండ: ప్రకాశం జిల్లాలోని చెరువుకొమ్ముపాలెం దగ్గర ఓ రైల్వే కానిస్టేబుల్ ఆనంద్ ఓ ఇంజనీరింగ్ విద్యార్థిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. గత రాత్రి బైక్ వెళ్తున్న విద్యార్థినిని కానిస్టేబుల్ అడ్డుకుని ఆమెను బైక్‌పై ఎత్తుకెళ్లాడు. ఈ క్రమంలో తోటి విద్యార్థులు కానిస్టేబుల్‌ను పట్టుకునే ప్రయత్నించేయడంతో బైక్‌ను వేగం పెంచాడు.

ఈ క్రమంలో బైక్ అదుపుతప్పడంతో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో విద్యార్థి కూడా స్వల్పగాయాలపాలైంది. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలావుంటే, నగదు మాయంపై తనను అవమానించడంతో మనస్తాపానికి గురై నల్లగొండ అటవీ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న అటెండర్ ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ అటవీశాఖ కార్యాలయంలో 2.33 లక్షల రూపాయలు మాయమయ్యాయి. దీంతో అధికారులు అటెండర్ కృష్ణయ్యను అనుమానించారు.

ఆ అవమాన భారాన్ని తట్టుకోలేక కృష్ణయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన బంధువులు కృష్ణయ్య మృతదేహంతో అటవీశాఖ అధికారి ఇంటి ముందు ఆందోళనకు దిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+