గోదావరి, ఫలక్ నుమా, నర్సాపూర్ సహా పలు ప్రధాన రైళ్లు రద్దు..!!
రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ఆర్నాబ్ తుఫాను ప్రభావం వేళ పలు ప్రధాన రైళ్లను రద్దు చేస్తూ.. అదే విధంగా మరి కొన్ని దారి మళ్లిస్తూ నిర్ణయం తీసుకుంది. విశాఖ మార్గంలో ముఖ్యమైన గోదావరి, ఫలక్ నుమా, గరీబ్ రథ్ సహా పలు ప్రధాన రైళ్లు రద్దు అయ్యాయి. నర్సాపురం సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ను రద్దు చేసారు. నాగర్ సోల్- నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ ను పాక్షికంగా రద్దు చేసిన అధికారులు.. తుఫాను ప్రభావం గమనిస్తూ అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
ఆర్నాబ్ తీవ్ర తుఫాను వేళ రైల్వే శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే విశాఖ మార్గంలో ప్రయాణించే 50కి పైగా రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ.. ఇప్పుడు మరి కొన్ని ప్రధాన రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈదురు గాలుల తీవ్రతతో పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే హెచ్చరికలతో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు రాకపోకలు సాగించాల్సిన పలు ప్రధాన రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్, లింగంపల్లి నుంచి బయల్దేరే గోదావరి, ఫలక్ నుమా, నర్సాపూర్, గరీభ్ రథ్ రైళ్లను ఈ రోజు వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నాగర్ సోల్- నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ ను పాక్షికంగా రద్దు చేసారు. అదే విధంగా 28న శ్రీకాకుళం రోడ్ నుండి చర్లపల్లికి వచ్చే రైలును రద్దు చేసారు.

తుఫాను వేళ రైల్వే కీలక నిర్ణయాలు
లింగంపల్లి నుంచి కాకినాడ మధ్య రాకపోకలు సాగించే ఎక్స్ ప్రెస్ ను ఈ రోజు వరకు రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ రాత్రికి తుఫాను తీవ్రత పెరిగి కోనసీమ జిల్లాలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తుఫాను తీరం దాటే వేళ ప్రచండ గాలులతో పాటుగా అత్యంత భారీ వర్షాలు కురుస్తామని ప్రభుత్వం వెల్లడించింది. దీంతో.. ముందుగా ఆ మార్గంలో ప్రయాణించే రైళ్ల పైన నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. తుఫాను ప్రభావం పైన ఏపీ ప్రభుత్వం నిరంతరం సమీక్ష చేస్తోంది. అవసరమైన చర్యల దిశగా అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇస్తోంది. అయితే.. తుఫాను 13 జిల్లాల పైన ప్రభావం ఉంటుందని అంచనా వేసినా, ప్రస్తుతం ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల వరకు తీవ్రత ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో.. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని రైల్వే అధికారులు స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications
