వందేభారత్ స్లీపర్ సిద్దం- ప్రత్యేకతలు, షెడ్యూల్..!!
రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్. వందే భారత్ స్లీపర్ కోచ్ లు సిద్ధమయ్యాయి. భద్రత .. అధునాతన సౌకర్యాలతో పట్టాలెక్కందుకు ముహూర్తం ఖరారు చేసారు. ఈ కోచ్ లను చన్నైలోని ఇంటీగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఆవిష్కరించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ తొలి వందేభారత్ కు ఇప్పటికే రూటు ఖరారు చేసారు. దీంతో, రాత్రి సమయంలోనూ దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేలా ఈ వందేభారత్ స్లీపర్ అందుబాటులోకి వస్తున్నాయి.
స్లీపర్ కోచ్ లు సిద్దం
వందే భారత్ స్లీపర్ కోచ్ లు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం వందే భారత్ రైళ్లకు దేశ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. 77 మార్గాల్లో వందే భారత్ నడుస్తున్నాయి. ఇప్పటి వరకు వందేభారత్ లో కూర్చొని ప్రయాణం చేసే విధంగానే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు స్లీపక్ కోచ్‌లతో రాత్రి వేళల్లో కూడా దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేందుకు వీలుగా ఏర్పాటు చేసారు. పూర్తి ఏసీ కోచ్‌లతో వందేభారత్ స్లీపర్ కోచ్‌లను ఐసీఎఫ్ తయారు చేస్తోంది. ఈ స్లీపర్ కోచ్‌లలో జీఎఫ్‌ఆర్‌పీ ప్యానెల్స్, సుఖవంతమైన కుషన్ ఫోమ్‌తో బెర్త్‌లు, వ్యాక్యూమ్ టాయిలెట్లు వంటివి ఉన్నాయి.

ఎన్నో ప్రత్యేకతలు
రైలు ప్రయాణికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వందేభారత్ స్లీపర్ బోగీలు ప్రస్తుతం తమిళనాడు చెన్నై ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ)లో తయారవుతున్నాయి. ఈ బోగీలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏకధాటిగా 1,200 కి.మీ. ప్రయాణించేందుకు అవసరమైన సదుపాయాలు ఉంటాయి. గంటకు గరిష్ఠంగా 160 కి.మీ. వేగంతో పయనించేలా రూపొందించారు. ఇందులో మొబైల్ ఛార్జింగ్, మేగజైన్లు, టేబుల్, చిన్నపాటి లైట్, సామగ్రి కోసం విశాల స్థలం, వేడి నీరు, సీసీ కెమెరాలు, అత్యవసర సమయాల్లో డ్రైవరుతో మాట్లాడే సౌకర్యం, బయో వాక్యూమ్ మరుగుదొడ్లు ఉన్నాయి.

సంక్రాంతి నుంచి
ఈ రైలులో జీఎఫ్‌ఆర్‌పీ ప్యానెల్స్, సుఖవంతమైన కుషన్ ఫోమ్‌తో బెర్త్‌లు వంటివి ఏర్పాటు చేసారు. ఫస్ట్ క్లాస్ ఏసీ కంపార్ట్‌మెంట్‌లో 24 మంది, సెకండ్ క్లాస్ ఏసీ కోచ్‌లో 188 మంది ప్రయాణించవచ్చని తెలిపారు. థర్డ్ క్లాస్ ఏసీ కోచ్‌లలో 611 మంది ప్రయాణికులు ప్రయాణం చేసే విధంగా రూపకల్పన చేసారు. త్వరలోనే సరకు రవాణా రైళ్లనూ రూపొందించాలని నిర్ణయించారు. అదే విధంగా 250 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించేందుకు వీలుగా హైస్పీడ్ రైలు ప్రాజెక్టు పైన కసరత్తు జరుగుతోంది. వచ్చే సంక్రాంతి నుంచి ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రయాణీకులకు అందుబాటులోకి రానున్నాయి.












Click it and Unblock the Notifications