ఏపీ మీదుగా చెన్నైకి ప్రత్యేక రైళ్లు.. హాల్ట్ స్టేషన్లు: అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్

పండగ సీజన్ లో రైళ్లకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. వివిధ పుణ్యక్షేత్రాలు, పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకునే వాళ్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుందీ పండగల సీజన్‌లో. వాళ్లంతా కూడా రైళ్ల మీదే ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది.

పండగ రద్దీ నేపథ్యంలో..

తాజాగా సంత్రాగచ్చి- తాంబరం మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ నెల 13వ తేదీన ఈ ఎక్స్ ప్రెస్ పట్టాలెక్కుతుంది. ఈ నెల 28వ తేదీ వరకు ఈ రెండు స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించనుంది. ఏపీ మీదుగా రాకపోకలు సాగించే ప్రత్యేక రైలు కావడం వల్ల పండగ పూట తమ స్వస్థలాలకు వెళ్లాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది. ఈ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ కోసం ఈ ఉదయం 8 గంటలకు అడ్వాన్స్ టికెట్ బుకింగ్ కూడా అందుబాటులోకి వచ్చింది.

Railways introduce Special Trains to Santragachi from Tambaram from October 13 to passengers rush

ఈ నెల 13, 20, 27 తేదీల్లో ప్రతి మంగళవారం ఉదయం 10:15 నిమిషాలకు తాంబరం నుండి బయలుదేరే నంబర్ 06075 ప్రత్యేక ఎక్స్ ప్రెస్ మరుసటి రోజు సాయంత్రం 6:30 గంటలకు సంత్రాగచ్చికి చేరుకుంటుంది.

బంగారం ధరల్లో బిగ్ ఫాల్: రెండో రోజూ: పసిడి కళకళ
బంగారం ధరల్లో బిగ్ ఫాల్: రెండో రోజూ: పసిడి కళకళ

తిరుగు ప్రయాణంలో.. ఈ నెల 14, 21, 28 తేదీల్లో ప్రతి బుధవారం రాత్రి 9:30 గంటలకు సంత్రాగచ్చి నుండి బయలుదేరే నంబర్ 06076 ప్రత్యేక రైలు మూడో రోజు ఉదయం 10:30 గంటలకు తాంబరం చేరుకుంటుంది.

హాల్ట్ స్టేషన్లు..

చెన్నై ఎగ్మూర్, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, పలాస, బ్రహ్మపూర్, ఖుర్దారోడ్, భువనేశ్వర్, నరాజ్ మార్థాపూర్, జైపూర్ కియొంఝర్ రోడ్, భద్రక్, బాలాసోర్, ఖరగ్ పూర్ మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది. ఈ రైలుకు ఈ ఉదయం 8 గంటలకు అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్ ఆరంభమైంది కూడా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+