AP Rains: రేపటి నుంచి ఏపీలో మరిన్ని వర్షాలు-ఎక్కడెక్కడంటే ?
ఏపీలో రాయలసీమతో పాటు దానికి ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు మీదుగా ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. దక్షిణ ఛత్తీస్ ఘడ్ నుంచి కొమోరిన్ ప్రాంతం వరకూ ద్రోణి విస్తరించి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో రాబోవు నాలుగు రోజులపాటు రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
రాష్ట్రంలో రేపు(శనివారం) అల్లూరి సీతారామ రాజు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
కురుస్తాయని అధికారులు తెలిపారు. అలాగే పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు మరియు బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

అలాగే ఎల్లుండి (ఆదివారం) అల్లూరి సీతారామ రాజు, అనంతపురం, సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు , తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ప్రకాశం, నెల్లూరు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపారు.
ఈ నెల 20న (సోమవారం) అల్లూరి సీతారామ రాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 21న శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామ రాజు, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అలాగే కర్నూలు, నంద్యాల, అనంతపురం శ్రీసత్యసాయి, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయి.












Click it and Unblock the Notifications