గణేష్‌కు వర్షం బ్రేక్!: బైక్‌పై యూత్, గర్ల్ సైతం (పిక్చర్స్)
హైదరాబాద్: ఓ వైపు గణేష్ నిమజ్జనం ఆనందంలో హైదరాబాద్ నగరం మునిగి ఉండగానే బుధవారం వర్షం కురిసింది. నగరంలో బుధవారం గంటలపాటు కుండపోత వర్షం కురిసింది. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురియడంతో నిమజ్జనానికి రెండు మూడు గంటలు ఆటంకం ఏర్పడింది.
వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తమైంది. మధ్యాహ్నం నుండే వర్షం ప్రారంభమైంది. సాయంత్రం అది కాస్త ఎక్కువైంది. దీంతో ప్రధాన రహదారులు అన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి.
నగరంలో భారీ వర్షం కురియడంతో భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో నడుం లోతు వరకు నీళ్లు వచ్చాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం కావడంతో అక్కడకు ట్రాఫిక్ పోలీసులు చేరుకోవడానికి ఇబ్బందులు పడ్డారు.

వర్షంలో దూసుకెళ్తున్నారు
బుధవారం రాష్ట్ర రాజధాని హైదరాబాదులో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షంలోనే ద్విచక్ర వాహనంపై దూసుకెళ్తున్న యువకులు.

మేము సైతం!
బుధవారం రాష్ట్ర రాజధాని హైదరాబాదులో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షంలోనే జలమయమైన రోడ్డు పైన స్కూటీ పైన వెళ్తున్న ఓ యువతి.

వర్షం కురుస్తున్నా
బుధవారం రాష్ట్ర రాజధాని హైదరాబాదులో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షంలోనే ద్విచక్ర వాహనంపై రాత్రి పూట వెళ్తున్న దృశ్యం.

కప్పేసుకున్నారు
బుధవారం ఓ వైపు నిమజ్జనం జరుగుతుండగానే జోరుగా వర్షం కురిసింది. దీంతో నిమజ్జనం కోసం వెళ్తున్న భక్తులు వాహనాల్లోనే కప్పుకున్న దృశ్యం.

రక్షణ
బుధవారం ఓ వైపు వినాయక నిమజ్జనం జరుగుతుండగానే జోరుగా వర్షం కురిసింది. దీంతో నిమజ్జనం కోసం వెళ్తున్న భక్తులు వాహనాల్లోనే కప్పుకున్న దృశ్యం.

వర్షంలో గణనాథులు
బుధవారం భారీ వర్షం కురువడంతో రెండు మూడు గంటలు వినాయక నిమజ్జనానికి ఆటంకం ఏర్పడింది. వర్షంలో వినాయకులు అద్భుతంగా కనిపిస్తున్న దృశ్యం.

వర్షంలో గణనాథుల క్యూ!
బుధవారం భారీ వర్షం కురువడంతో రెండు మూడు గంటలు వినాయక నిమజ్జనానికి ఆటంకం ఏర్పడింది. చార్మినార్ వద్ద గణనాథుల వరుస.












Click it and Unblock the Notifications