బాబు ఆఫీసులో నీళ్లు: సిటీలో కుండపోత (ఫొటోలు)
హైదరాబాద్: నగరంలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంప్ కార్యాలయం లేక్‌వ్యూ గెస్ట్ హౌస్ మొదటి అంతస్థు పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయింది. సోమవారం రాత్రి భారీ వర్షం కురవడంతో ముఖ్యమంత్రి చందర్బాబు వ్యక్తిగత సిబ్బంది పనిచేసే గది పైకప్పు కూలిపోయింది.
చంద్రబాబునాయుడు అక్కడి నుంచి వెళ్లిన కాసేపటికే గదిపైకప్పు కుప్పకూలింది. సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. దీంతో లేక్‌వ్యూకు వెళ్లాలా వద్దా అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా, హైదరాబాద్‌లోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్ స్తంభించింది. హైదరాబాదులోని పలు ప్రాంతాల్లోని రోడ్లపై నీళ్లు నిండిపోయాయి.

వరదలో కారు ఇలా..
హైదరాబాదులో భారీ వర్షం కురవడంతో రోడ్లు జలమయం అయ్యాయి. ఆ నీటిలో అతి కష్టంగా వాహనాలు నడిచాయి.

జలంతో విలవిల
భారీ వర్షంతో రోడ్లు జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు తీవ్రమైన ఇబ్బంది ఏర్పడింది. వాహనాలు నీటిలో సగం వరకు మునిగిపోయాయి.

అతి భారంగా కుటుంబం
ద్విచక్రవాహనం వాననీటిలో ఓ కుటుంబాన్ని ఇలా మోయలేక మోసుకుంటూ పోతున్నట్లు కనిపించింది. వాన నుంచి రక్షణ కోసం తీసుకున్న చర్యలేవీ ఫలించలేదు.

తోసుకుంటూ పోవడమే..
రోడ్లపై నిలిచిన నీటికి ఆగిపోవడంతో వాహనాన్ని నీళ్లలో తడిసి ముద్దయి తోసుకుంటూ పోవడం తప్ప మరో మార్గం కనిపించనట్లుగా..

వానలో ఏడ్వలేక నవ్వుతూ..
రోడ్లపై ప్రయాణం కనాకష్టంగా మారింది. నీటికి ఏడుపు ముంచుకుని వస్తుంటే నవ్వుతూ ఇలా ప్రయాణం సాగించారు.

ప్లాస్టిక్ సంచీ కాపాడుతుందా..
వాన నీటిలో తడిసి ముద్దయి ఓ వ్యక్తి ఇలా.. తలపై ప్లాస్టిక్ బ్యాగ్ పెట్టుకుంటే రక్షణ ఇస్తుందా.. ప్రయాణం ఇలా..

అమ్మాయిలు ఇలా...
వాననీటిలో తడిసి అమ్మాయిలు ద్విచక్రవాహనంపై అమ్మాయిలు ఇలా ప్రయాణం సాగించారు.

డివైడర్‌పై ఇలా..
నీళ్లలో నడవలేక ఓ వ్యక్తి ఇలా డివైడర్‌పై ప్రయాణం చేస్తూ కనిపించాడు. ఇటూ అటూ వాహనాలు ఇలా కనిపించాయి.

నీటి గండమే..
నీటిలో వాహనాలు ఇలా సాహసం చేశాయి. పెద్ద యెత్తున రోడ్లపై నీళ్లు సముద్రాన్ని తలపిస్తున్నాయి.

ఇదేమి కష్టం..
హైదరాబాదులో జీవిస్తున్నందుకు వానపడితే రోడ్లపై ప్రయాణమనే నరకాన్ని భరించాల్సిందేనా అనే బాధ చెప్పనలవి కాదు.

రోడ్లపై పడవల్లా కారు
రోడ్లు సముద్రాల్లా మారిపోయాయి. వాటిలో వాహనాలు పడవలా దిక్కు తోచని స్థితిలో ప్రయాణించాయి.

నీటిలో ఇలా..
వర్షానికి హైదరాబాదు రోడ్లు పూర్తిగా జలమయ్యాయి. అందులో అటువంటి రోడ్లపై వాహనాలు అతి కష్టం మీద నడిచాయి.












Click it and Unblock the Notifications