పాపాగ్ని నది మధ్యలో చిక్కుకున్న 30మంది కూలీలు: ఇద్దరు దంపతుల మృతి
చిత్తూరు: జిల్లాలోని పెద్దతిప్ప సముద్రం మండలం పి.సదుం వద్ద పాపాగ్ని నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పాపాగ్ని నది మధ్యలో 30మంది కూలీలు చిక్కుకున్నారు. నదిలో చిక్కుకున్న కూలీలను కాపాడేందుకు స్థానికులు యత్నిస్తున్నారు.
గార్గేయ నదిలో కొట్టుకుపోయిన దంపతులు
భారీ వర్ల కారణంగా గార్గేయ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఐరాల మండలంలోని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో లోతట్టుప్రాంతాల ప్రజలు రాత్రంతా నిద్రలేకుండా గడిపారు. పెద్ద తిప్పసముద్రం మండలం పి సదుం దగ్గర పాపాగ్ని నది ఉధృతంగా ప్రవహిస్తుంది.
కాగా, సోమవారం పీలేరు సమీపంలో గార్గేయనదిలో కొట్టుకుపోయిన దంపతులు సురేష్‌కుమార్‌రెడ్డి, గీతాంజలిల మృతదేహాలు తమ్మలవారిపల్లె దగ్గర లభించాయి.

పలు రైళ్లు రద్దు
భారీ వర్షాలకు గుత్తి-రేణిగుంట సెక్షన్‌లోని రాజంపేట-పుల్లంపేట, నందలూరు-మంటపంపల్లె మధ్య రైల్వే ట్రాక్‌పై వరద నీరు ప్రవహిస్తుండడంతో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్యరైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎం ఉమాశంకర్‌కుమార్ తెలిపారు.
తిరుపతి-హుబ్లీ ప్యాసింజర్ (రైల్ నెంబర్ 57274)ను నవంబర్ 24వ తేదీన రద్దు చేశారు.
హుబ్లీ - తిరుపతి ప్యాసింజర్ (రైల్ నెంబర్ 57273)ను నవంబర్ 24న రద్దు చేశారు. కాచిగూడ- తిరుపతి ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ (రైల్ నెంబర్ 22120)ను నవంబర్ 25, 28వ తేదీల్లో రద్దు చేశారు. తిరుపతి-కాచిగూడ ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ (రైల్ నెంబర్ 22119)ను నవంబర్ 26, 29వ తేదీల్లో రద్దు చేశారు.












Click it and Unblock the Notifications