కడపలో ‘తిరుమల ఎక్స్‌ప్రెస్’ నిలిపివేత: ప్రయాణికుల ఆందోళన, వర్షాలతో 18 రైళ్లు రద్దు
కడప: రైల్వే శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా సుమారు 2000 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటన కడప రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. ప్రయాణికులను కడప రైల్వే స్టేషన్‌లో దించేయడంతో వారు రైల్వే అధికారులతో వాగ్వాదానికి దిగారు.
వివరాల్లోకి వెళితే.. తిరుమల ఎక్స్‌ప్రెస్ శనివారం ఉదయం వైజాగ్ నుంచి తిరుపతికి బయలుదేరింది. నెల్లూరు-రేణిగుంట మీదుగా ఈ రైలు తిరుపతికి వెళ్లాల్సి ఉంది. కాగా వర్షాలతో నెల్లూరు నుంచి తిరుపతికి వెళ్లే ఆస్కారం లేకపోవడంతో కడప వెళ్లి అక్కడి నుంచి వెళ్లొచ్చని రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ఈ క్రమంలో విజయవాడ నుంచి గుంటూరు, నంద్యాల, ఎర్రగుంట్ల మీదుగా రైలు కడపకు వచ్చింది. అంతకముందు విజయవాడకు వచ్చిన తర్వాత అధికారులు భారీ వర్షాల వల్ల రైల్వే వంతెనలు దెబ్బతిన్నాయని రైలు తిరుపతికి వెళ్లదని స్పష్టం చేశారు. దీంతో ప్రయాణికులు అక్కడ దిగిపోయారు. కాసేపు తర్వాత రైల్వే అధికారులు వెళ్లొచ్చు అని ప్రకటించడంతో అందరూ మళ్లీ రైలు ఎక్కారు.

అయితే, ఆదివారం ఉదయం కడపకు చేరుకున్న తర్వాత అక్కడి నుంచీ తిరుపతికి వెళ్లే మార్గంలో రైల్వే వంతెన దెబ్బతిందని అధికారులు చెప్పారు. దీంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం లేకపోవడం వల్లే సమస్య వచ్చిందని ప్రయాణికులు రైల్వే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రైల్వే అధికారులు ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ప్రయాణికులను బస్సులో తిరుపతికి పంపించారు.
భారీ వర్షాలతో 18 రైళ్లు రద్దు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో పలు రైళ్లు రద్దయ్యాయి. భారీ వర్షాలతో రైలు పట్టాలపైకి వరద నీరు చేరడం, రైలు పట్టాలు భారీగా కొతకు గురి కావడంతో రైళ్ల సర్వీసులు నిలిచిపోయాయి. ఏపీలో కురుస్తున్న భారీవర్షాలు, వరదల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. మరి కొన్ని దారి మళ్లించినట్టు తెలిపింది. అత్యధికంగా వరదలు పోటెత్తిన నెల్లూరు- పడుగపాడు మార్గంలో 18 రైళ్లు రద్దు చేయగా, రెండు రైళ్లు తాత్కాలికంగా నిలిపివేశారు. 10 రైళ్లను దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే ట్విట్టర్‌లో వెల్లడించింది.
రద్దయిన రైళ్ల సర్వీసుల వివరాలు:
20895 రామేశ్వరం- భువనేశ్వర్
22859 పూరి- చెన్నె సెంట్రల్
17489 పూరి- తిరుపతి
12655 అహ్మదాబాద్- చెన్నై సెంట్రల్
12967 చెన్నై సెంట్రల్- జైపూర్
06426 నాగర్‌సోల్- తిరువనంతపురం
06427 తిరువనంతపురం- నాగర్‌సోల్
06425 కొల్లాం- తిరువనంతపురం
06435 తిరువనంతపురం- నాగర్‌సోల్
12863 హౌరా- యశ్వంతపూర్
12269 చెన్నై సెంట్రల్- హజరత్ నిజముద్దీన్ ఢిల్లీ
12842 చెన్నై సెంట్రల్- హౌరా
12656 చెన్నై సెంట్రల్- అహ్మదాబాద్
12712 చెన్నై సెంట్రల్- విజయవాడ
12510 గువహటి- బెంగళూరు కంటోన్మెంట్
15930 న్యూ తినుసుకియా - తాంబరం
20890 తిరుపతి- హౌరా
17651 చెంగల్‌పట్టు - కాచిగూడ
దారి మళ్లించిన రైళ్ల సర్వీసుల వివరాలు:
12642 హజరత్ నిజాముద్దీన్- కన్యాకుమారి
12616 న్యూదిల్లీ- చెన్నై సెంట్రల్
22877 హౌరా- ఎర్నాకుళం
12845 భువనేశ్వర్- బెంగళూరు కంటోన్మెంట్
22502 న్యూ తిన్‌సుకియా- బెంగళూరు
12270 హజరత్ నిజాముద్దీన్- చెన్నై సెంట్రల్
12655 అహ్మదాబాద్- చెన్నై సెంట్రల్
12622 న్యూదిల్లీ- చెన్నై సెంట్రల్
12296 దానపూర్- బెంగళూరు
12968 జైపూర్- చెన్నై సెంట్రల్
తాత్కలికంగా నిలిపివేసిన రైళ్ల వివరాలు:
Recommended Video
15906 డిబ్రూగఢ్ - కన్యాకుమారి రైలు, 12708 హజరత్ నిజాముద్దీన్- తిరుపతి రైలును తాత్కాలికంగా నిలిపివేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications