ఏపీలో మరో ఐదురోజులపాటు వర్షాలు.. ఐఎండీ సూచన..!
రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇక, ఏపీలో అయితే పలు ప్రాంతాల్లో వర్షాలు కురవగా, మరికొన్ని చోట్లు ఎండలు ఉన్నాయి. ఏపీలో మరో ఐదురోజులపాటు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ సూచించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ఎఫెక్టుతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిస్తే, మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐఎండీ ఏపీ ప్రజలకు మరో చల్లటి కబురును అందించింది. రానున్న ఐదురోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
నేడు కోస్తాలోని పార్వతీపురం, అల్లూరి, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా, నిన్నరాత్రి నుంచి విజయవాడలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోన్న సంగతి తెలిసింది. ఇక, తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ నగరంలో కూడా అక్కడక్కడ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో మరో ఐదురోజుల పాటు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమలో రాబోయే 5 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

నేడు రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
కోస్తాంధ్రలో నేడు రేపు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల క్రమంలో లొతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రేపు (శుక్రవారం) రాష్ట్రంలోని మన్యం, అల్లూరి,విశాఖ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వీటితోపాటు శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications