Rains: ఉత్తరకోస్తాలో భారీవర్షాలు; రెండురోజులపాటు ఏపీకి వానగండం; వాతావరణశాఖ అలెర్ట్!!

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్నటి నుంచి వాతావరణం చల్లబడి, వర్షాలు కురుస్తున్నాయి. ఇక మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నేడు ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలోని వివిధ ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణా సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.

రాబోయే రెండు రోజులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణం కేంద్రం వెల్లడించింది. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలలో కొన్నిచోట్ల పిడుగులు తో కూడిన ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీచేసింది.

Rains Heavy rains in North Coastal districts rains in AP for two days Weather Alert

ఉపరితల ద్రోణి ప్రభావంతో నిన్న శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ జిల్లాలలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కురిసాయి. ఇక ఇదే సమయంలో కృష్ణ, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా, బాపట్ల, పల్నాడు జిల్లా, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఒక పోస్టు పెట్టారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో చాలా వరకు, అనకాపల్లి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చెట్లు, టవర్స్, పోల్స్ క్రింద ఉండరాదన్నారు.

పొలాలు, మైదానాలు మరియు ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. విపత్తుల సంస్థ నుంచి అలెర్ట్ మేసేజ్లు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోండి అశ్రద్ధ వహించవద్దు అని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+