Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో 3 రోజులు వర్షాలు, ఈ జిల్లాలకు అలర్ట్

తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం కొనసాగుతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉక్కపోత, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుండగా.. సాయంత్రం నుంచి వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, పిడుగులు పడుతున్నాయి.

వాతావరణ అనిశ్చితి ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు పడటంతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో ఆయా జిల్లాల్లో ఎండ తీవ్రత కూడా ఎక్కువగానే ఉండనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Rains in AP for the next 3 days alert for these districts

మరోవైపు, హైదరాబాద్ తోపాటు తెలంగాణ జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత, ఉక్కపోతతో అల్లాడిపోయిన నగరవాసులకు సాయంత్రం కురిసిన వర్షం ఉపశమనం కలిగించింది. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మరోవైపు, ఈదురుగాలులు వీయడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, నాంపల్లి, హిమాయత్ నగర్​, ముషీరాబాద్​, విద్యానగర్, రామ్ నగర్, ఖైరతాబాద్‌, మియాపూర్, దిల్‌సుఖ్‌నగర్‌లో ఒక్కసారిగా ఈదురు గాలులలో వాన కురిసింది. గాలుల ఉధృతి తీవ్రంగా ఉండటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

కుత్బుల్లాపూర్, దుండిగల్, సుచిత్ర, కొంపల్లి, జగద్గిరిగుట్ట తదితర ప్రాంతాల్లోనూ ఈదురుగాలులతో మోస్తరు వర్షం పడుతోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా పరిధిలో ముందుగా ఈదురుగాలులు భయంకరమైన వాతావరణం సృష్టించాయి. తరువాత భారీ వర్షం కురిసింది. అమీర్‌​పేట్, పంజాగుట్ట, మధుర నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పరిసరాల ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.

కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్, మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్, కార్వాన్, ఎల్బీనగర్, వనస్థలిపురం, భాగ్యలతా, హయత్​‌నగర్​, పెద్ద అంబర్​పేట్, అబ్దుల్లాపూర్​మెట్​ ప్రాంతంలోనూ వర్షం పడుతోంది. ఈదురుగాలులు వీస్తుండటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+