హెచ్చరిక: ఏపీకి భారీ వర్షాలు చెప్పిన వాతావరణశాఖ
వేసవికాలాన్ని మించిన ఎండలతో తీవ్రంగా అల్లాడుతున్న ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ శుభవార్తను వినిపించింది. ఆది, సోమవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలతోపాటు తేలికపాటి జల్లులు కురుస్తాయని వెల్లడించింది. బంగాళాఖాతంలో గతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతోపాటు అది వెళ్లిపోతూ తేమ గాలుల్ని తీసుకుపోయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉక్కపోత పోస్తోంది. ఇటువంటి తరుణంలో ఉత్తర కర్ణాటకు ఆనుకొని తెలంగాణలో ఆవర్తనం విస్తరించివుంది. దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
భారీ వర్షాలకు ఆస్కారం
సోమవారం రోజు అన్నమయ్య, నంద్యాల, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, ప్రకాశం, ఏలూరు, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది. వైఎస్సార్ కడప, శ్రీసత్యసాయి, కర్నూలు, నెల్లూరు, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని పేర్కొంది. ఆదివారం రోజు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ప్రకాశం, నంద్యాల, ఏలూరు, తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

తెలంగాణలో కూడా..
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక జారీచేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిడుగులు పడే అవకాశం ఉండటంతో ఎవరూ బయట తిరగొద్దని సూచించింది. పొలాల్లో పనిచేసే రైతులు, రైతు కూలీలు, పశువుల కాపర్లు చెట్ల కింద, విద్యుత్తు స్తంభాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. తెలంగాణలోని మహబూబ్ నగర్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, సిద్ధిపేట, హన్మకొండ, ములుగు, వరంగల్, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.












Click it and Unblock the Notifications