ఏపీ, టీ సమస్యలు: ఎంపీలకి జగన్, గీత పైన..(పిక్చర్స్)

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ పార్లమెంటు సభ్యులకు సూచించారు. శనివారం లోటస్ పాండులో ఎంపీలతో జగన్ భేటీ అయ్యారు. లోకసభలో అనుసరించాల్సిన వ్యూహం పైన చర్చించారు. అనంతరం మేకపాటి విలేకరులతో మాట్లాడారు.

పార్లమెంటు చర్చల్లో చురుగ్గా పాల్గొనడంతో పాటు ఇరురాష్ట్రాల్లో జరగాల్సిన అభివృద్ధికి సంబంధించి, సంబంధిత మంత్రులతోనూ భేటీలు నిర్వహించాలని జగన్ సూచించారని మేకపాటి చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులకు తక్షణమే నిధులు విడుదలయ్యేలా మంత్రులపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పారన్నారు.

నంద్యాల, అరకు పార్లమెంటు సభ్యులు ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీతలను అనర్హులుగా ప్రకటించాలని మరోమారు సభాపతిని కోరుతామన్నారు. హుధుద్ తుఫాను సాయం, రైతుల సమస్యలు, ముంపు మండలాలు తదితర అంశాల పైన పార్లమెంటులో తమ గళం వినిపిస్తామని మేకపాటి తెలిపారు.

కాగా, పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రెండు రాష్ట్రాల సమస్యలను ప్రస్తావించాలని వైయస్ జగన్ తన పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. సభలో పార్టీ వ్యవహరించాల్సిన వైఖరిపై ఈ సందర్భంగా ఆయన ఎంపీలకు సలహాలు, సూచనలు చేశారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ ఎంపీలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

హైదరాబాదులోని లోటస్ పాండులో గల పార్టీ కార్యాలయంలో ఎంపీలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి.

మేకపాటి

మేకపాటి

శనివారం లోటస్ పాండులో ఎంపీలతో జగన్ భేటీ అయ్యారు. లోకసభలో అనుసరించాల్సిన వ్యూహం పైన చర్చించారు. అనంతరం మేకపాటి విలేకరులతో మాట్లాడారు.

మేకపాటి

మేకపాటి

భేటీలో తమ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారో విలేకరుల సమావేశంలో చెబుతున్న మేకపాటి.

పార్లమెంటు

పార్లమెంటు

పార్లమెంటు చర్చల్లో చురుగ్గా పాల్గొనడంతో పాటు ఇరురాష్ట్రాల్లో జరగాల్సిన అభివృద్ధికి సంబంధించి, సంబంధిత మంత్రులతోనూ భేటీలు నిర్వహించాలని జగన్ సూచించారని మేకపాటి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+