వందే సాధారణ్ వచ్చేస్తోంది, ముహూర్తం ఫిక్స్ - ఎన్నో ప్రత్యేకతలు..!!

భారతీయ రైల్వేలో మరో నూతన శకం ప్రారంభం అవుతోంది. వందేభారత్ కు ప్రయాణీకులకు మంచి ఆదరణ కనిపిస్తోంది. అయితే, వందేభారత్ లో టికెట్ ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు. ఈ సమయంలోనే సామాన్యులకు వందేభారత్ వేగంతో నాన్ ఏసీ వర్షన్ తో వందే సాధారణ్ రైలు అందుబాటులోకి వస్తోంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా ఈ రైలు ప్రత్యేకతలను రివీల్ చేసారు. ఈ రైలు అందబాటులోకి తెచ్చే ముహూర్తం ఖరారు చేసారు.

సాధారణ్ వందే: వందేభారత్ తరహాలో సామాన్యలు కోసం నాన్ ఏసీ వందే సాధారణ్ రైలు సిద్దం అవుతోంది. దేశంలోనే తొలి సెమీ హైస్పీడ్ రూలు వందేభారత్ దేశ వ్యాప్తంతా దూసుకెళ్తున్నాయి. ఇప్పటి వరకు 34 రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటి వరకు ఏసీ సిట్టింగ్ సౌకర్యం మాత్రమే అందుబాటులో ఉంది. అయినా..ప్రయాణీకుల నుంచి మాత్రం ఆదరణ తగ్గటం లేదు. ఇదే సమయంలో దూర ప్రాంతాలకు వందేభారత్ రైళ్లను ఏర్పాటు చేయాలనే డిమాండ్లు ఉన్నాయి. స్లీపర్ కోచ్ లు అందుబాటులోకి రాగానే దూరపు ప్రాంతాలకు వందేభారత్ ప్రారంభానికి రైల్వే శాఖ సిద్దం అవుతోంది. ఇదే సమయంలో..వందేభారత్ లో ధరలు ఎక్కువగా ఉండటంతో...సామాన్యుల కోసం వందే సాధారణ్ సిద్దం అయింది,

Raiwlay Minister Aswini Viashnav Reveals first look of push pull vande sadharan loco

అన్ని సౌకర్యాలతో : వందే సాధారణ్ రూలు నాన్ ఏసీ. దీనిని నాన్ ఏసీ పుష్ పుల్ ట్రైన్ అని కూడా పిలుస్తారు. అంటే రైలు ముందు, వెనుక రెండింటిలో ఇంజన్లు ఉన్నాయి. రైలు ఎక్కడి నుండైనా వేగంగా దూసుకుపోగలదు. ఈ ఏడాది చివరి నాటికి ఈ రైలు వచ్చే అవకాశం ఉంది. ఈ నెలాఖరులోగా దీని ట్రాయల్ రన్ ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేసారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ సిద్దం అవుతోంది. ఈ రైలు సెట్ సిద్ధంగా ఉంది, దీనికి 22 కోచ్‌లు ఉన్నాయి. రెండు వైపులా లోకోమోటివ్ ఇంజన్లు అమర్చబడి ఉంటాయి. ఇందులో 12 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 8 జనరల్ కోచ్‌లు, 2 గార్డు కోచ్‌లు ఉన్నాయి. చిత్తరంజన్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ లో వందే సాధన కోసం ప్రత్యేకంగా రెండు ఇంజన్‌లను తయారు చేస్తున్నారు.


ప్రత్యేక సదుపాయాలు : వందే మెట్రో, వందే స్లీపర్ కోసం కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. వందే భారత్, వందే మెట్రో స్లీపర్ వెర్షన్‌పై రైల్వే కూడా వేగంగా పని చేస్తోంది. తాజాగా, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వందే భారత్ స్లీపర్ వెర్షన్ రైలు కాన్సెప్ట్ ఫోటోను పంచుకున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి వచ్చే అవకాశం ఉంది. ఈ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి, వాటిలో 11 AC 3 టైర్, 4 AC 2 టైర్, 1 కోచ్ 1st AC. వచ్చే ఏడాది మార్చిలోపు ఈ రైలు సెట్ సిద్ధమై, ఆ తర్వాత మొదటి రైలును పరీక్షకు పంపనున్నారు. అదే సమయంలో, ఫిబ్రవరి-మార్చి నాటికి వందే మెట్రోకు సంబంధించి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ రైళ్లు అందుబాటులోకి రావటం ద్వారా పూర్తిగా రైల్వేలో కొత్త శకం మొదలవుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+