బాబుగారూ.. ఇంతకీ అక్కడ తేల్చారా? అంతేనంటారా..?

రాజాం నియోజకవర్గానికి సంబంధించిన సీటు విషయంలో తెలుగుదేశం పార్టీలో సందిగ్ధత నెలకొంది. రానున్న ఎన్నికల్లో సీటు తనదేనని మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మ బహిరంగంగానే చెబుతున్నారు. వాస్తవానికి ఇక్కడ ఇన్ ఛార్జిగా కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన కొండ్రు మురళీమోహన్ ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత కొన్నిరోజులుగా పార్టీలో యాక్టివ్ గా లేరు.

చంద్రబాబు పక్కనే కొండ్రు మురళి

చంద్రబాబు పక్కనే కొండ్రు మురళి

తాజాగా చంద్రబాబు 'ఇదేం ఖర్మ' కార్యక్రమంలో భాగంగా రాజాంలో రోడ్ షో నిర్వహించారు. రాజాం, పొందూరు షోలకు జనం భారీగా తరలివచ్చారు. పొందూరులో సభ లేకపోయినప్పటికీ జనం రావడంతో కాన్వాయ్ ను ఆపి మాట్లాడాల్సి వచ్చింది. తర్వాత రాజాం సెంటర్ లో హాజరైన ప్రజలనుద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. పర్యటన మొత్తం చంద్రబాబు పక్కనే కొండ్రు మురళి ఉన్నారు. అనూహ్యంగా ఒక ఘటన జరిగింది. కార్యక్రమం మధ్యలోనే ప్రతిభా భారతి కాన్వాయ్ దిగి వెళ్లిపోయారు. రాజాం నియోజకవర్గ టికెట్ గురించి ప్రతిభా భారతి, కొండ్రు మురళి మధ్య కొన్నాళ్లుగా విభేదాలు నెలకొన్నాయి.

కుమార్తెకు టిక్కెటివ్వమంటున్న ప్రతిభా భారతి

కుమార్తెకు టిక్కెటివ్వమంటున్న ప్రతిభా భారతి

రాజాంలో మొదటి నుంచి ప్రతిభా భారతి పోటీచేస్తున్నారు. అయితే గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన కొండ్రు మురళికి బాబు సీటు ఇచ్చారు. అతను కూడా ఓటమిపాలయ్యారు. మొన్నటివరకు సైలెంట్ గా ఉన్న మురళి ఇటీవలికాలం నుంచి యాక్టివ్ అయ్యారు. అలాగే ప్రతిభా భారతి కూడా తన కుమార్తె గ్రీష్మకు టికెట్ ఇప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. గ్రీష్మ సైతం దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. మహానాడులో బహిరంగంగా తొడ కొట్టి అందరి దృష్టినీ ఆకర్షించారు. అయితే చంద్రబాబు పర్యటన మధ్యలోనే ప్రతిభా భారతి వెళ్లిపోవడంతో బాబు మురళివైపు మొగ్గుచూపుతున్నరాని స్పష్టమవుతోంది. అయితే అధికారికంగా ఇక్కడ సీటు ఎవరికి అనేది ప్రకటించలేదు.

లోకేష్ కలిసి పనిచేసుకుందామన్నారు..

లోకేష్ కలిసి పనిచేసుకుందామన్నారు..


గ్రీష్మ సీటు తనకే వస్తుందని, అందరం కలిసి పనిచేసుకుందామని లోకేష్ చెప్పారంటూ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు మురళివైపే మొగ్గుచూపుతున్నారనే అనుమానం ప్రతిభా భారతి వర్గంలో ఉంది. గతానికి భిన్నంగా ఏడాదిన్నర నుంచే సీట్లు ఖరారు చేసుకుంటూ వస్తున్న బాబు రాజాం సీటును పెండింగ్ లో పెట్టారు. అయితే ఆయన మురళివైపే మొగ్గుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయం అర్థమవడంతోనే ప్రతిభా భారతి కూడా మధ్యలో నుంచి వెళ్లిపోయారని రాజాం పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే చివరగా టికెట్ ఎవరికి దక్కుతుందో వేచిచూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+