అందుకే బాబుతో ఎక్కువ సేపు మాట్లాడలేదు: రాజమౌళి, డిజైన్లపై మళ్లీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రముఖ దర్శకుడు రాజమౌళి బుధవారం ఉదయం భేటీ అయ్యారు. అయితే రాజధాని అమరావతి డిజైన్లపై వారి మధ్య చర్చ జరిగింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రముఖ దర్శకుడు రాజమౌళి బుధవారం ఉదయం భేటీ అయ్యారు. అయితే రాజధాని అమరావతి డిజైన్లపై వారి మధ్య చర్చ జరిగింది.

పూర్తిస్థాయిలో చర్చించలేదు
కానీ పూర్తిస్థాయిలో చర్చ జరగలేదు. ఇందుకోసం ఈరోజు మరోసారి భేటీ కానున్నారు. అయితే, అవసరమైతే డిజైన్ల కోసం రాజమౌళిని లండన్ పంపించనున్నారని కూడా తెలుస్తోంది. చంద్రబాబుతో భేటీ అనంతరం రాజమౌళి మాట్లాడారు.

నేను ఆలస్యంగా వచ్చా అందుకే: రాజమౌళి
తాను సీఎం చంద్రబాబును కలిశానని రాజమౌళి చెప్పారు. అయితే డిజైన్ల పైన ఎక్కువసేపు చర్చించలేదని చెప్పారు. పూర్తిస్థాయిలో చర్చ జరగలేదన్నారు. తాను ఆలస్యంగా రావడం వల్ల ఎక్కువసేపు మాట్లాడలేకపోయినట్లు వెల్లడించారు. మధ్యాహ్నం మరోసారి భేటీ అవుతామని చెప్పారు.

ఇంతకుముందే డిజైన్ల అందజేత
బుధవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో రాజమౌళి, చంద్రబాబు భేటీ అయ్యారు. ఇంతకుముందే, ఇందులో భాగంగా రెండు రోజుల కిందట మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ సీహెచ్ శ్రీధర్‌లు రాజమౌళితో భేటీ అయి డిజైన్ ప్రతులు అందించారు.

త్వరలో లండన్ వెళ్లే అవకాశం
సీఎం చంద్రబాబు నాయుడు రాజమౌళి బాహుబలి సెట్టింగ్‌కు ఫిదా అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల అమరావతి డిజైన్లపై అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు.. అవసరమైతే రాజమౌళిని లండన్ పంపించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.
-
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications