NTR: జూనియర్ NTR ప్రత్యేక విందు

స్టార్‌ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ (NTR) తన నివాసంలో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. టాలీవుడ్‌ సినీ ప్రముఖులు పలువురు దీనికి హాజరయ్యారు. అమెజాన్‌ స్టూడియోస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జేమ్స్‌ ఫర్రెల్‌ ఈ విందుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఎన్టీఆర్‌ తన ఇన్‌స్టా గ్రామ్ ఖాతాలో షేర్‌ చేశారు.

జూనియర్ ఎన్టీఆర్‌ తన నటనతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ప్రత్యేకమైన అభిమాన గణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో కొమురం భీం పాత్రలో నటనకు విదేశీ ప్రముఖులు కూడా ఎన్టీఆర్ కు అభిమానులయ్యారు. హాలీవుడ్‌ చిత్రాల్లోనూ నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎన్టీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్‌ పార్టీకి జేమ్స్‌ ఫర్రెల్‌ కూడా హాజరవ్వడం తెలుగు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రత్యేక విందుకు దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, కొరటాల శివ హాజరయ్యారు. వీరితో పాటు మరికొందరు నిర్మాతలు కూడా అతిథులుగా వచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

 ntr

తారక్‌ తన 30వ చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్‌ నటిస్తోంది. 2024 ఏప్రిల్‌ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత కేజీయఫ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నారు.

ntrtrivikramrajamouli
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+