చంద్రబాబు విజయం వెనుక రాజమౌళి - ఆ ఫార్ములా తో బ్లాక్ బస్టర్..!!
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనన్నారు. ఈ సారి ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు తొలి నుంచి అన్ని సమీకరణాల అమల్లో పక్కాగా వ్యవహరించారు. ఇదే సమయంలో ఏపీలో చంద్రబాబు విజయం వెనుక దర్శకుడు రాజమౌళి ఫార్ములా బాగా పని చేసింది. అదే ఏపీలో ఊహించని విజయానికి కారణమైంది.
సూపర్ హిట్ కాంబో
ఏపీలో టీడీపీ కూటమి అనూహ్య విజయం సాధించింది. ఏకంగా 164 స్థానాలు విజయం సాధించింది. అందులో జగన్ పాలన పైన వ్యతిరేకతో పాటుగా చంద్రబాబు అమలు చేసిన సమీకరణాలు కీలక పాత్ర పోషించాయి. దీని వెనుక ఆశ్చర్యకర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్శకుడు రాజమౌళి తీర్చి దిద్దిన ఆర్ఆర్ఆర్ లో హీరోల కాంబోతో సీనిమా హిట్ అయింది. ఆస్కార్ అవార్డు దక్కింది. తెలుగు సినీ పరిశ్రమలో హీరోలకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. అందులో మెగా, నందమూరి కుటుంబాలకు ఉన్న క్రేజ్ చాలా ఎక్కువ. ఆర్ఆర్ఆర్ లో ఈ రెండు కుటుంబాలకు చెందిన హీరోల కాంబో కొత్త చరిత్ర మొదలైంది.

పొలిటికల్ కాంబినేషన్
ఏపీలోనూ రాజకీయంగా కాపు,కమ్మ, రెడ్డి వర్గాల ఆధ్వర్యంలో నడిచే పార్టీలుగా టీడీపీ..జనసేన...వైసీపీ పైన ముద్ర ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఇద్దరు యువ హీరోల కాంబో తో బ్లాక్ బస్టర్ సాధించారు. అదే ఫార్ములా చంద్రబాబు రాజకీయంగా అమలు చేసారు. చంద్రబాబు ఈ ఎన్నికల్లో గెలుపు కోసం పవన్ తో కలిసారు. అంతటితో ఆగలేదు. బీజేపీతోనూ పొత్తు పెట్టుకున్నారు. బీజేపీ నుంచి తొలుత సరైన స్పందన రాకపోయినా సహనంతో వేచి చూసారు. 2014లోనూ ఇవే పార్టీలతో చంద్రబాబు కలిసినా..ఆ ఎన్నికల్లో పవన్ తో సహా ఆ పార్టీ నుంచి ఎవరూ పోటీ చేయలేదు. ఈ సారి బరిలో నిలిచారు.
రాజమౌళి - చంద్రబాబు
2019 ఎన్నికల్లో పవన్ రెండు చోట్ల ఓడిపోయారు. ఆ సానుభూతి..పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ ఎన్నికల్లో కలిసి వచ్చింది. రాజకీయంగా వైరుధ్యం ఉన్న రెండు ప్రధాన సామాజిక వర్గాలు ఎన్నికల్లో కలిసి పని చేసాయి. అధికార పార్టీ తప్పులు కలిసి వచ్చాయి. పవన్ తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వమంటూ అడిగిన తీరు ఓటర్లకు నచ్చింది. మెగా, నందమూరి అభిమానులతో పాటుగా రెండు వర్గాలకు చెందిన వారు ఏకపక్షంగా కూటమి కోసం పని చేసారు. ఫలితంగా భారీ విజయం సాధించారు. భారీ అంచనాలను అందుకొనే విధంగా ఇప్పుడు చంద్రబాబు - పవన్ పని చేయాల్సి ఉంది. సినిమా రంగంలో రాజమౌళి ప్రయోగం.. ఇప్పుడు చంద్రబాబు ఫార్ములా సక్సెస్ కావటంతో ఈ అంశం సోషల్ మీడియా వేదికగా ఆసక్తి కర చర్చకు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications