రాజన్న రాజ్యంబు వచ్చేనయ : అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు: కాలజ్ఞానంలో ఏపీ ఎన్నికల ఫలితం..!
కాలజ్ఞానం నిర్దేశించిన బ్రహ్మం గారు ఎప్పుడో ఏపీ ఎన్నికల ఫలితాలను చెప్పేసారు. కాలజ్క్షానంలో ప్రస్తుతం నడుస్తున్న వికారి సంవత్సరంలో తెలుగు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆయన నాడే అంచనా వేసారు. ఏపీలో ఎన్నికల మూడ్ మొదలైన నాటి నుండి నేటి వరకు వెల్లడవుతున్న సర్వేల్లో అధికంగా వైసీపీకే అధికారం దక్కుతుందని చెబుతూ వస్తున్నాయి. అయితే, టీడీపీ నేతలు మాత్రం విజయం తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఇప్పుడు బ్రహ్మం గారి కాలజ్ఞానం లో బ్రహ్మంగారు ఏం చెప్పారో..అది ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది..

తెలుగు రాష్ట్రంలో రాజన్న రాజ్యంబు
తెలుగు పంచాంగం ప్రకారం ప్రస్తుతం వికారి నామ సంవత్సరం నడుస్తోంది. ఈ ఏడాదిలో జరిగిన ఎన్నికల్లో ఏం జరుగుతుందో కాలజ్ఞానంలో బ్రహ్మంగారు స్పష్టంగా చెప్పుకొచ్చారు. వికారి సంవత్సరంబున తెలుగు రాష్ట్రమున మార్పులొచ్చచేనయ..! చంద్రదోషము నాడు వీడేనయ..!రాజన్న రాజ్యంబు వచ్చేనయ..! తప్పదు నా మాట నమ్మండయ..! అంటూ అందులో పేర్కొన్నారు. కొద్ది రోజులుగా ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్కంఠ రేపుతున్న ఏపీ ఎన్నికల్లో గెలుపు మాది అంటే మాది అని టీడీపీ..వైసీపీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తాము 130 సీట్లకు పైగా గెలుస్తామని టీడీపీ అధినేత చెబుతుంటే..తమది లాండ్ స్లైడ్ విక్టరీ అంటూ వైసీపీ అధినేత జగన్ పోలింగ్ నాడు రాత్రి స్పష్టం చేసారు. ఇక, పోలింగ్ ముగిసిన నాటి నుండి రాజకీయాలు అనేక టర్న్‌లు తీసుకున్నాయి.

సర్వేలే కాదు..బ్రహ్మం గారిదీ అదే మాట..
ఏపీలో ఎన్నికల్లో విజయం గురించి ఎన్నికల షెడ్యూల్ రాకముందు నుండి ఈ రోజు వరకు అనేక సర్వేలు వచ్చాయి. అందులో అధిక శాతం సర్వేలు వైసీపీకే మొగ్గు చూపాయి. జాతీయ ఛానళ్లు నిర్వహించిన సర్వేలు సైతం లోక్‌సభ సీట్లలో అధికంగా గెలుచుకోవటంతో పాటుగా అసెంబ్లీలోనూ వైసీపీ అధికారం దక్కించుకుంటుందని వెల్లడించాయి. వైసీపీ నేతలు సైతం తమదే అధికారం అనే ధీమాలో..ప్రమాణ స్వీకార ముహూర్తం సైతం ఖరారు చేస్తున్నారు. ఇదే విధంగా టీడీపీ నేతలు సైతం తామ మరోసారి అధికారంలో కొనసాగటం ఖాయమని..ఈ నెల 23న ఫలితాలు వెల్లడయ్యాక..ఈ నెల 25న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని చెబుతున్నారు. దీంతో..ఫలితాల మీద ఆసక్తిగా చూస్తున్న వారిలో మరిత ఉత్కంఠ పెరిగింది. రెండు పార్టీల్లో ఎవరిది విశ్వాసమో..ఎవరిది అతి విశ్వాసమో తెలియక 23వ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు.

లగడపాటి..బ్రహ్మం గారు..ఎవరు నిజం..
సర్వేలు అధిక శాతం వైసీపీకి అనుకూలంగా ఉంటే..ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ మాత్రం డైరెక్ట్‌గా చెప్పక పోయినా..పరోక్షంగా టీడీపీ గెలుస్తుందని చెబుతున్నారు. తాజాగా అమెరికాలో జరిగిన టీడీపీ ఎన్నారై సమావేశంలోనూ ఇదే విషయం రాజగోపాల్ స్పష్టం చేసారు. ప్రజలు అభివృద్ది..సంక్షేమానికే ప్రాధాన్యత ఇచ్చారని చెప్పుకొచ్చారు. లగడపాటి చెప్పిన జ్యోస్యాన్నే టిడీపీ నేతలు బలంగా నమ్ముతున్నట్లు కనిపిస్తోంది. ఇక, కాలజ్ఞానంలో బ్రహ్మంగారు వికార నామ సంవత్సరంలో రాజన్న రాజ్యం వస్తుందంటూ చెప్పిన అంశం ఇప్పుడు వెలుగు లోకి రావటంతో.. ఎవరి జోస్యం నిజమవుతుందనే చర్చ మొదలైంది. లగడపాటి తెలంగాణ ఎన్నికల సమయంలో చెప్పిన జోస్యం విఫలం కావటంతో ఆయన చెబుతున్న దానిని ఎంత వరకు నమ్మాలో తెలియని పరిస్థితి. వీటన్నింటికీ సమాధానం కావాలంటే ఈ నెల 23 వరకు వేచి చూడాల్సిందే..












Click it and Unblock the Notifications