టిలో జీవిత, రాజశేఖర్ ప్రచారం: జనగాంలో రాములమ్మ

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ ప్రాంతంలో ఆ పార్టీ నాయకురాలు, దర్శక నిర్మాత జీవిత, ఆమె భర్త, హీరో రాజశేఖర్‌లు ప్రచారం చేయనున్నారు. తెలంగాణలో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలను గెలుచుకునేందుకు బిజెపి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే జాతీయ నేతలు మోడీ, సుష్మా స్వరాజ్ తదితరులు ప్రచారం చేయనున్నారు.

పవన్ కళ్యాణ్.. మోడీ సభల్లో పాల్గొంటున్నారు. బిజెపి కోసం ఆయన ప్రచారానికి కూడా సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ సాధన విషయంలో లోకసభలో కీలక పాత్ర పోషించిన సుష్మాస్వరాజ్‌ను ఆ పార్టీ ఎన్నికల ప్రచారంలోకి దింపనుంది. సుష్మా షెడ్యూల్ ఇప్పటికే ఖరారయింది.

Rajasekhar, Jeevitha to campaign in Telangana

ఈ నెల 26న కల్వకుర్తి, మెదక్, వరంగల్, భువనగిలలో నిర్వహించే బహిరంగ సభల్లో ఆమె పాల్గొంటారు. అలాగే, ఈ నెల 25న మణుగూరు, భూపాలపల్లి, సిరిసిల్ల, సంగారెడ్డిల్లో కిషన్ రెడ్డి, సినీ నటులు జీవిత, రాజశేఖర్‌లు ప్రచారం చేయనున్నారు.

జనగాంలో విజయశాంతి ప్రచారం

కాంగ్రెసు పార్టీ నాయకురాలు, మెదక్ నుండి అసెంబ్లీకి పోటీ చేస్తున్న విజయశాంతి మంగళవారం టిపిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య నియోజకవర్గం.. జనగామలో ప్రచారం నిర్వహించారు.

విజయరమణా రావు అరెస్ట్, విడుదల

కరీంనగర్ జిల్లా పెద్దపల్లి టిడిపి ఎమ్మెల్యే విజయరమణా రావును హైదరాబాద్ బొల్లారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల సందర్భంగా 10 రోజుల క్రితం మారేడ్‌పల్లిలో నిర్వహించిన తనిఖీల్లో రూ.90 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో విజయరమణారావు ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి అనంతరం విడుదల చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+