వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరుకు రాజ్యసభ సీటు ఒట్టి పుకారేనన్న నాగబాబు- తప్పుడు వార్తలతో కన్ఫ్యూజ్ చేయొద్దని విజ్ఞప్తి

|
Google Oneindia TeluguNews

మెగాస్టార్ చిరంజీవికి ఏపీలో వైసీపీ రాజ్యసభ సీటు ఆఫర్ చేస్తుందన్న ప్రచారంలో నిజం లేదని ఆయన సోదరుడు నాగబాబు ఇవాళ క్లారిటీ ఇచ్చారు. తప్పుడు ప్రచారంతో జనసైనికుల్లో గందరగోళం సృష్టించవద్దని ఆయన కోరారు.
అన్నయ్య చిరంజీవి తన జీవితాన్ని కళారంగానికే అంకితం చేయాలని నిర్ణయించుకున్నారని నాగబాబు తెలిపారు

 చిరుకు రాజ్యసభ సీటు కేవలం పుకారే

చిరుకు రాజ్యసభ సీటు కేవలం పుకారే


ఒక రాజకీయ పార్టీ అన్నయ్య చిరంజీవికి రాజ్యసభ సీటు ఇవ్వబోతోందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యుడు, చిరంజీవి సోదరుడు నాగబాబు స్పష్టత ఇచ్చారు. అన్నయ్య చిరు తన సినిమా కెరీర్ పై దృష్టి పెట్టారని, కళారంగానికే జీవితం అంకితం చేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ఈ మేరకు బుధవారం తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన ఓ వీడియోను పోస్టు చేశారు.
"చిరంజీవి గారు రాజకీయాలు వద్దనుకున్నారు. ఆయన కావాలనుకుంటే దేశంలో ఏ పార్టీ అయినా ఘనస్వాగతం పలికి రాజ్యసభ సీటు ఇస్తుంది. రాజ్యసభ సీటు కోసం వెళ్లాల్సిన అవసరం అన్నయ్యకు లేదు అనేది నా అభిప్రాయం. ఒకవేళ ఆయనకు అలాంటి ఆలోచనే ఉండి ఉంటే ఇలా అనుకుంటున్నాను తమ్ముడు అని ఓపినియన్ నాతో చెప్తారు. రాజకీయాల్లో ఆయన చూడని ఎత్తులు లేవు, పల్లాలు లేవు. రాష్ట్ర ముఖ్యమంత్రితో సమానమైన సెంట్రల్ మినిస్టర్ పదవి అలంకరించారు.
• పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేశారు
అన్నయ్య చిరంజీవి గారు ఏ రాజకీయ పార్టీకి సపోర్టు చేయడం లేదు. అన్నయ్య ఉద్దేశం ఏంటంటే.. రాజకీయాల్లో అన్నాదమ్ములు ఇద్దరు ఉండకూడదు. ఎవరో ఒక్కరే ఉండాలి. తమ్ముడు కళ్యాణ్ బాబు రాజకీయ భవిష్యత్తు బాగుండాలంటే తాను రాజకీయాల్లో ఉండకూడదని ఎప్పుడో నిర్ణయం తీసుకొని త్యాగం చేశారు. త్యాగం అని ఎందుకు అన్నానంటే.. కళ్యాణ్ బాబుకు ఉన్న డెడికేషన్ చూసి తనకన్నా కళ్యాణే బాగా చేయగలుగుతాడు అని అన్నయ్య అనుకున్నారు. అలా అన్నయ్య పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆయన నిర్ణయాన్ని కుటుంబం మొత్తం స్వాగతించాం. చిరంజీవి గారికి ఒక రాజకీయ పార్టీ నుంచి రాజ్యసభ సీటు లభిస్తోందని వస్తున్న వార్తలను ఎప్పటినుంచో ఖండించాలని అనుకున్నాను. కానీ ఇదే సరైన సమయమని ఇప్పుడు ఖండిస్తున్నానని నాగబాబు తెలిపారు.

అమరావతిపై అభిప్రాయం చెప్పడం తప్పా ?

అమరావతిపై అభిప్రాయం చెప్పడం తప్పా ?

అమరావతిపై అన్నయ్య చిరంజీవి తన అభిప్రాయాన్ని చెప్తే విజయవాడకు చెందిన కొందరు నిర్మాతలు ఏదేదో మాట్లాడేశారని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అలా అభిప్రాయాలు చెప్పడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. చిరంజీవి ఇంటి ముందు ధర్నాలు చేయాలనే ఆలోచన మానుకోవాలని ప్రత్యర్ధులకు ఆయన సూచించారు. తాను, తమ్ముడు పవన్ కళ్యాణ్ అమరావతికి తమ వంతు మద్దతు ఇస్తున్నామని, పవన్ జనసేన తరఫున పోరాటం చేస్తున్నారని నాగబాబు గుర్తుచేశారు.

Recommended Video

Mega Star Chiranjeevi Emotional On Disha Issue || Oneindia Telugu
 చిరుతో రాజకీయం చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు

చిరుతో రాజకీయం చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు

సినిమాలతో బిజీగా ఉన్నఅన్నయ్య చిరంజీవిని రాజకీయాల్లోకి లాగొద్దని నాగబాబు సూచించారు. ఆయనతో రాజకీయం చేయాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. దయచేసి వ్యక్తిగత స్వార్ధం కోసం తప్పుడు వార్తలను ప్రచారం చేసి మెగా అభిమానులు, జనసైనికుల్లో కన్ఫ్యూజ్ సృష్టించవద్దని మెగా బ్రదర్ కోరారు.

English summary
Jana Sena Party PAC Member Nagababu Gives Clarity on Chiru's Rajya Sabha Seat Rumours
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X