Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజ్యసభలో హైడ్రామా- విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు- ఛైర్మన్‌ వెంకయ్య మనస్తాపం

ఇవాళ రాజ్యసభలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరుగుతున్న చర్చ కాస్తా ఓ దశలో టీడీపీ వర్సెస్‌ వైఎస్సార్సీపీగా మారిపోయింది. ఈ సమయంలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ సీఎం జగన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అనుమతించలేదు. దీంతో రెచ్చిపోయిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏకంగా వెంకయ్యపైనే తీవ్ర వ్యాఖ్యలకు దిగారు. దీంతో ఆయన మనస్తాపం చెందారు. సాయిరెడ్డి తీరును ఇతర పార్టీల ఎంపీలు సైతం తప్పుబట్టారు.

Recommended Video

    #venkayyanaidu #vijayasaireddy రాజకీయ దుమారం రేపుతోన్న ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు
     ఇవాళ రాజ్యసభలో హైడ్రామా

    ఇవాళ రాజ్యసభలో హైడ్రామా

    ఇవాళ మధ్యాహ్నం రాజ్యసభలో రాష్టపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతోంది. అంతకుముందే రైతుల ఆందోళనలపై ప్రధాని మోడీ ప్రసంగించి వెళ్లారు. అనంతరం టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ మాట్లాడుతూ సీఎం జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతరం వీటిని రికార్డుల నుంచి తొలగించాలంటూ వైసీపీ ఎఁపీ విజయసాయిరెడ్డి పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ ఇచ్చారు. దీనికి రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు అంగీకరించలేదు. దీంతో అసలు గొడవ మొదలైంది.

    వెంకయ్య తీరుపై సాయిరెడ్డి ఆగ్రహం

    వెంకయ్య తీరుపై సాయిరెడ్డి ఆగ్రహం

    సభలో లేని వైసీపీ అధినేత, సీఎం జగన్‌పై టీడీపీ ఎంపీ కనకమేడల చేసిన వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలంటూ తాను ఇచ్చిన పాయింట్ ఆఫ్‌ ఆర్డర్‌ను రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు తోసిపుచ్చడంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. వైసీపీ ఎంపీలతో కలిసి వెల్‌లోకి దూసుకురావడమే కాకుండా వెంకయ్య టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆయనపై తీవ్ర వ్యాఖ్యలకు దిగారు. ఈ హఠాత్పరిణామంతో రాజ్యసభలో ఇతర ఎంపీలు కూడా షాకయ్యారు. బీజేపీనీ, టీడీపీని లింక్‌ చేస్తూ మరీ వెంకయ్యపై సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై ఇతర పార్టీల ఎంపీలు సైతం తీవ్ర అభ్యంతరం తెలిపారు.

    వెంకయ్య మనసు బీజేపీతో, తనువు టీడీపీతో

    వెంకయ్య మనసు బీజేపీతో, తనువు టీడీపీతో


    వెంకయ్యనాయుడిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్లో ఆయన్ను విజయసాయిరెడ్డి రాజకీయంగా టార్గెట్‌ చేసే ప్రయత్నం చేశారు. మీ మనసు బీజేపీతో, తనువు టీడీపీతో ఉన్నాయంటూ సాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకే టీడీపీ ఎంపీపై మీరు చర్యలు తీసుకోలేక పోతున్నారంటూ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఓ దశలో వెంకయ్య కూడా అవాక్కయ్యారు. కాసేపటికే కోలుకుని సాయిరెడ్డి వ్యాఖ్యలపై వెంకయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

    సాయిరెడ్డి వ్యాఖ్యలతో వెంకయ్య మనస్తాపం

    సాయిరెడ్డి వ్యాఖ్యలతో వెంకయ్య మనస్తాపం

    తనపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర మనస్తాపం చెందారు. సాయిరెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఉప రాష్ట్రపతి పదవికి ప్రతిపాదన వచ్చిన వెంటనే పార్టీకి రాజీనామా చేశానని, అప్పటినుంచి ఇప్పటివరకూ రాజకీయ కార్యక్రమాల్లో సైతం పాల్గొనడం లేదని గుర్తుచేశారు. తన హృదయం దేశ ప్రజలతో మమేకమై ఉందన్నారు. అయితే ఎవరేం వ్యాఖ్యలు చేసినా తాను పట్టించుకోబోనని వెంకయ్య పేర్కొన్నారు. వ్యక్తిగతంగా మాత్రం సాయిరెడ్డి వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు.
    దీంతో ఇతర పార్టీల ఎంపీలు కూడా జోక్యం చేసుకుని విజయసాయిరెడ్డిపై చర్యలకు డిమాండ్‌ చేశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+