రామ్ చరణ్, అల్లు అర్జున్ మధ్య ఏం జరుగుతోంది?
Ramcharan - Allu Arjun:మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కనిపించలేదు. తన పుట్టినరోజును పురస్కరించుకొని రామ్ చరణ్ గ్రాండ్ పార్టీ ఇచ్చారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని ప్రముఖులంతా హాజరయ్యారు. నాగార్జున, వెంకటేష్, నాగచైతన్య, అఖిల్, రానా, విజయ్ దేవరకొండ, అల్లు అరవింద్, రాజమౌళి, కీరవాణి, వంశీ పైడిపల్లి, దిల్ రాజు, హరీష్ శంకర్, శ్రీకాంత్, నవీన్ యెర్నేని, వై.రవిశంకర్.. తదితర ప్రముఖులంతా ఈ పార్టీకి హాజరై రామ్ చరణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.
మెగా ఫ్యామిలీకి సంబంధించిన పవన్ కల్యాణ్, నాగబాబు, అల్లు శిరీష్ తదితరులంతా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్ లోనే ఉన్న అల్లు అర్జున్ పార్టీకి హాజరుకాకపోవడంతోపాటు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఎటువంటి శుభాకాంక్షలు తెలియజేయలేదు. బాలీవుడ్ కు చెందిన ప్రముఖులు కూడా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేసినప్పటికీ అల్లు అర్జున్ కనీసం ఇన్ స్టాగ్రామ్ లో కూడా చిన్న ఫొటో పెట్టకపోవడం, ట్వీట్ చేయకపోవడంపైనే చర్చ నడుస్తోంది.

అల్లు అరవింద్ హాజరైనప్పటికీ అల్లు అర్జున్ హాజరుకాకపోవడమే అందరికీ సంశయాన్ని రేకెత్తించింది. అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ కాదని, సెల్ఫిష్ స్టార్ అంటూ మెగా అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. హైదరాబాద్ లోనే పుష్ప2 షూటింగ్ జరుగుతోంది. ఇక్కడే ఉండి పార్టీకి హాజరుకాకపోవడం అంటే కావాలనే అల్లు అర్జున్ బర్త్ డే పార్టీకి దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు. రామ్ చరణ్ బన్నీని ఆహ్వానించాడా? లేదా? అనే విషయంలో స్పష్టత లేదు.
కొంతకాలంగా చిరంజీవి, రామ్ చరణ్ చిత్రాలు గీతా ఆర్ట్స్ బ్యానర్ మినహా ఇతర బ్యానర్లలో నిర్మితమవుతున్నాయి.. లేదంటే సొంతంగా నిర్మించుకుంటున్నారు. చిరంజీవి, అల్లు అరవింద్ కుటుంబాల మధ్య పైకి చెప్పని వివాదాలేదో నడుస్తున్నాయని, లేదంటే అందరూ శుభాకాంక్షలు చెప్పినా అల్లు అర్జున్ కనీసం ఇన్ స్టాగ్రామ్ లో చిన్న ఫొటో పెట్టకపోవడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది.












Click it and Unblock the Notifications