రామ్ చరణ్ ఝలక్!: తమ్ముడి బాటలో చిరంజీవి యూటర్న్ తీసుకుంటారా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెగా సోదరుడు నాగబాబు అనంతరం చెర్రీ కూడా తన బాబాయి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మద్దతు పలికారు.
రాజమండ్రి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెగా సోదరుడు నాగబాబు అనంతరం చెర్రీ కూడా తన బాబాయి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మద్దతు పలికారు.
రాజమండ్రి సమీపంలో జరిగిన ఫ్యాన్స్ మీట్‌లో రామ్ చరణ్ తేజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సినిమాల్లో అయినా, రాజకీయల్లో అయినా పవన్‌కు అందరూ అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

చిరంజీవి మినహా..!
2019లో పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ప్రస్తుతం చిరంజీవి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. మెగా సోదరులవి వేర్వేరు పార్టీలు కావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఎటువైపు ఉంటారనే చర్చ చాలాకాలంగా సాగుతోంది.

నాగబాబు యూటర్న్!
చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నందున, తాను కూడా ఆయన వైపేనని నాగబాబు తొలుత చెప్పారు. అయితే, కొద్ది నెలల క్రితం నాగబాబు యూటర్న్ తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ మంచి చేసే ఉద్దేశ్యంతో పార్టీ పెట్టాడని, తన మద్దతు ఆయనకే ఉంటుందని ప్రకటించారు. తన అన్నయ్య చిరంజీవి కూడా 2019లో పవన్‌కు మద్దతివ్వాలని కోరుకుంటున్నానని చెప్పారు.

రామ్ చరణ్ తేజ
ఇప్పుడు స్వయంగా చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ కూడా బాబాయ్‌కే మద్దతు పలికారు. రాజకీయాల్లో బాబాయ్ వైపే ఉండాలని అభిమానులకు పిలుపునివ్వడం ద్వారా.. తన మద్దతు ఆయనకేనని ప్రకటించారు. పలువురు మెగా కుటుంబ సభ్యులు కూడా పవన్ వైపే ఉన్నారు.

మిగిలింది మెగాస్టార్..! వేర్వేరు దారులు
మెగా కుటుంబ సభ్యులు దాదాపు పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక మిగిలింది చిరంజీవేనని అంటున్నారు. తామిద్దరివి వేర్వేరు దారులు అని గతంలో పలుమార్లు ఈ మెగా సోదరులు చెప్పారు. అంతిమంగా మాత్రం ప్రజల కోసం పని చేయడమే అన్నారు. తమవి వేర్వేరు దారులు కాబట్టి చిరంజీవి తన వైపు వచ్చే అవకాశం లేదని పవన్ గతంలో అభిప్రాయపడ్డారు.

చిరంజీవి వస్తారా.. తమ్ముడి విజ్ఞప్తికి ఒకే చెప్తారా?
2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్న నేపథ్యంలో తమ్ముడు నాగబాబు కోరుకున్నట్లుగా చిరంజీవి జనసేనకు అండగా నిలబడతారా? చూడాలి. నాగబాబు, రామ్ చరణ్ తేజ వరుసగా పవన్‌కు మద్దతు అంటున్న నేపథ్యంలో చిరంజీవిపై చర్చ సాగుతోంది.
-
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications