అవేం తెలియవు: పవన్‌కు 'మద్దతు'పై రామ్ చరణ్, తెలివిగా తప్పించుకున్నాడు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ ఓ టీవీ ఛానల్ ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా ఉంది. ఓ టీవీ ఛానల్ రామ్ చరణ్ తేజను రాజకీయాల గురించి ప్రశ్నించింది. దానికి చెర్రీ గడుసుగా సమాధానం చెప్పి తప్పించుకున్నాడని భావించవచ్చు.
ఇటీవల జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... తాను 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. దీని పైన జర్నలిస్ట్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌కు మద్దతిస్తారా అని ప్రశ్నించారు. దానికి రామ్ చరణ్ తెలివిగా సమాధానం చెప్పారు.
తనకు రాజకీయాల గురించి పెద్దగా తెలియదని వ్యాఖ్యానించారు. పవన్‌కు మద్దతుపై ప్రశ్నిస్తే అసలు మద్దతు అంటే ఏమిటో తెలియదని అభిప్రాయపడ్డారు. రాజకీయాల గురించి మాట్లాడేంత అనుభవం తనకు లేదని చెప్పారు.

కాగా, చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో ఉన్నారు. తామిద్దరివి రాజకీయంగా వేరు దారులు అయినప్పటికీ... కుటుంబంగా మాత్రం ఒక్కటేనని చెప్పారు. రామ్ చరణ్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారని చెప్పవచ్చు.
కుటుంబంగా మాత్రం ఒక్కటే.. రాజకీయంగా తండ్రి, బాబాయి వేర్వేరు దారుల్లో ఉండటంతో అతను తెలివిగా సమాధానం చెప్పారని అంటున్నారు. లేదంటే ఇంట్లో ఇన్నాళ్ల నుంచి రాజకీయాలు జరుగుతుంటే రాజకీయాలు తెలియవని, మద్దతు గురించి తెలియదని చెప్పడం ఏమిటంటున్నారు. తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకుంటున్నారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications