వంగవీటి రాధా ఓ పిల్లాడు, రంగా గురించి ఏం తెలుసు: రామ్ గోపాల్ వర్మ
హైదరాబాద్: వంగవీటి రాధా ఓ పిల్లాడని, నాన్న, పెదనాన్న గురించి అతను చాలా తెలుసుకోవాలని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. వంగవీటి రాధా తండ్రి వంగవీటి రాధా కాగా పెదనాన్న వంగవీటి రాధాకృష్ణ. వంగ వీటి రంగా గురించి నెహ్రూకు తెలిసినంతగా రాధాకు తెలీదని ఆయన ట్విట్టర్‌లో అన్నారు.
రంగాపై వర్మ సినిమాతీస్తే అభిమానులు ఒప్పుకోరని వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలపై వర్మ తనదైన శైలిలో ట్విట్టర్‌లో దాడి చేశారు. వీడు ఎంత పెరిగినా ఇంకా పిల్లాడిలా ప్రవర్తిస్తాడని రంగా గారు ఒకసారి తనతో అనడంతో షాకయ్యానని రాధా గురించి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇవ్వాల్టి రాధా కన్నా ఆనాటి రాధా, రంగాలతో తాను ఎక్కువ సమయం గడిపానని చెప్పారు.
అప్పట్లో పిల్లాడిలా బ్యాక్‌గ్రౌండ్‌లో ఆడుకొంటున్న నేటి రాధాను చూశానని రాశారు. రంగా తనయుడైన ఇవ్వాల్టి రాధాకు ఆనాటి రాధా వాల్యూలో ఒక్క శాతం అర్థమై ఉంటే తను కూడా మాటల రాధా కాకుండా చేతల రాధా అయ్యేవాడని వర్మ ట్వీట్ చేశారు.

తనకు కుల పిచ్చి లేదంటూనే కాపుల వెనకాల దాక్కొనే కమ్మ మనస్తత్వమున్న వాడిని మొదటి సారి చూశానని నేత రాధా గురించి వర్మ పోస్ట్ చేశారు. ఎప్పుడో స్పాట్‌లో లేని వాళ్లు కేవలం స్పాట్లు పెట్టినవాళ్లకి పుట్టినంత మాత్రా న వాళ్లే స్పాట్లనుకుంటే అది వాళ్ల పిల్లతనమని వ్యాఖ్యానించారు.
ఎందుకంటే ఇవాల్టి రాధా అప్పుడు పిల్లోడని, చెప్పుడు మాటలు నమ్మాడని, కానీ నేనప్పుడు స్పాట్‌లో ఉన్నానని మరో ట్విట్ చేశారు. వంగవీటి రంగా గురించి తనయుడి కన్నా తనకే ఎక్కువ తెలుసని, ప్రస్తుత రాధాకు తెలియని పెదనాన్న(సీనియర్ రాధా) అసలు విషయాలు తనకు తెలుసని వర్మ అన్నారు.












Click it and Unblock the Notifications