అసదుద్దీన్‌పై పోటీ ట్రాష్: రామ్ గోపాల్ వర్మ ట్వీట్
హైదరాబాద్: హైదరాబాదు లోకసభ స్థానంలో మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీపై తాను పోటీ చేస్తున్నట్లు వచ్చిన వార్తలను ప్రముఖ చలనచిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఖండించారు. అసదుద్దీన్‌పై తాను పోటీ చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన అన్నారు.
హైదరాబాదు లోకసభ స్థానంలో అసదుద్దీన్ తాను పోటీ చేస్తున్నట్లు వచ్చిన వార్తలు అబద్ధమని ఆయన ట్వీట్ చేశారు. అసదుద్దీన్ ఓవైసీపై రామ్ గోపాల్ వర్మ శివసేన అభ్యర్థిగా పోటీ చేస్తారంటూ గత కొద్ది రోజులుగా మీడియాలో వార్తలు వచ్చాయి.

చిరంజీవి హటావో దేశ్ బచావో అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. దాంతో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేస్తారనే వార్తలు ఊపందుకున్నాయి. అంతేకాకుండా, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఆయన స్వాగతం పలికారు.
రాజకీయాలపై, రాజకీయ నాయకులపై ఆయన తరుచుగా వింతైన, విచిత్రమైన ట్వీట్స్ చేస్తూ ఉండడం పరిపాటే.












Click it and Unblock the Notifications