ఆ కాళ్లు ఎవరివంటే- ఆర్జీవీ లాట్ ఆఫ్ ఫన్..?!:
అమరావతి: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రాబోతోన్న లేటెస్ట్ మూవీ.. వ్యూహం. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలను కథాంశంగా చేసుకుని తెరకెక్కుతోందీ సినిమా. దాసరి కిరణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. ఇదివరకు వంగవీటి సినిమాను నిర్మించింది ఆయనే. ఇటీవలే ఈ సినిమాలో నటిస్తోన్న పాత్రధారుల ఫొటోలను రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, ఆయన భార్య భారతిరెడ్డి పాత్రల ఫొటోలను రిలీజ్ చేశారు. వైఎస్ జగన్ పాత్రను తమిళనటుడు అజ్మల్ పోషిస్తోన్నాడు. వైఎస్ భారతి క్యారెక్టర్‌లో మానస రాధాకృష్ణన్ నటిస్తోన్నారు. దీని తరువాత వ్యూహం సినిమాకు సంబంధించిన పలు వర్కింగ్ స్టిల్స్‌ను రామ్ గోపాల్ వర్మ.. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేస్తూ వచ్చారు.

ఇదివరకే తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి వర్కింగ్ స్టిల్ కూడా బయటికొచ్చింది. ఈ నెల 24వ తేదీన టీజర్ కూడా విడుదలయింది. సినిమా ఎలా ఉండబోతోందనేది తేల్చేశారు రామ్ గోపాల్ వర్మ. రెండు పార్టులుగా చిత్రకరణను జరుపుకొంటోంది వ్యూహం. తొలి పార్ట్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణం, వైఎస్ జగన్ ఓదార్పుయాత్ర వంటివి ఉంటాయి.
రెండో పార్ట్‌లో 2014 తరువాతి రాజకీయ పరిణామాలు ఉంటాయని తెలుస్తోంది. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ అసెంబ్లీలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వంపై పోరాడిన తీరు, మహా ప్రస్థానం పాదయాత్రకు దారి తీసిన పరిణామాలను రెండో పార్ట్‌లో రామ్ గోపాల్ వర్మ చిత్రీకరించనున్నారు.
2019 ఎన్నికల్లో జగన్ సాధించిన తిరుగులేని విజయాన్ని ఇందులో చూపించనున్నారు.

కాగా- సినిమా సెట్స్ మీద ఉన్న ప్రస్తుత సమయంలో రామ్ గోపాల్ వర్మ అమెరికాకు బయలుదేరి వెళ్లనున్నారు. టెక్సాస్ స్టేట్‌లోని డల్లాస్‌లో నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ కన్వెన్షన్‌కు హాజరు కానున్నారు. ఈ విషయాన్ని ఆర్జీవీ ధృవీకరించారు. తాను నాటా సభకు హాజరు కానున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు.
20 సంవత్సరాల తరువాత అమెరికాకు వెళ్లబోతోన్నానని రామ్ గోపాల్ వర్మ చెప్పారు. నాటా సభపై నాటు సాంగ్‌తో అల్లాడిస్తానని పేర్కొన్నారు. కార్పెట్‌పై బాసింపట్టు వేసుకుని కూర్చున్న ఆర్జీవీ వెనుక ఓ యువతి.. స్కర్ట్‌తో లగ్జూరియస్ సీట్‌లో కూర్చోవడం, చేతిలో గ్లాస్‌తో అటు ఇటూ తిరగడం ఈ వీడియోలో కనిపించింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తరువాత.. నెటిజన్లు ఆర్జీవీని ప్రశ్నలతో ముంచెత్తారు. ఆమె ఎవరు? నాటా సభకు ఆమె కూడా వస్తోందా? అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. దీనికి ఆర్జీవీ సమాధానం ఇచ్చారు. ఆమె ఢల్లాస్‌కు రావట్లేదని బదులిచ్చారు. ఆమె గురించి ఆరా తీసిన వారికి రిప్లై ఇచ్చారు. ఆమె పేరు సిరి స్టేజీ అని చెప్పారు.












Click it and Unblock the Notifications