Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

థర్డ్ డిగ్రీ భయంలో రామ్ గోపాల్ వర్మ.. హైకోర్టులో మరో పిటీషన్!

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. తనను విచారణకు రమ్మని ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో విచారణకు హాజరు కావడానికి సమయం కావాలని కోరిన ఆయన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక తన పిటీషన్ లో తన పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని రాంగోపాల్ వర్మ పేర్కొనడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

రాం గోపాల్ వర్మ కొంప ముంచిన వ్యూహం
గత ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా విడుదల సమయంలో రాంగోపాల్ వర్మ చంద్రబాబు కుటుంబాన్ని టార్గెట్ చేసి అనుచిత పోస్టులు పెట్టారు. చంద్రబాబు, నారా లోకేష్, బ్రాహ్మణిలతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటోలను కూడా మార్ఫింగ్ చేసి ఆ ఫోటోలను రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఆయన చేసిన అనుచిత పోస్టులకు సంబంధించి రాంగోపాల్ వర్మ పైన మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.

Ram Gopal Varma fears in the possibility of using third degree bail petition in ap highcourt

పోలీసుల విచారణకు నాలుగు రోజుల సమయం కోరిన వర్మ
దీంతో ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు రావాలని రాంగోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చారు. నిన్న రాంగోపాల్ వర్మ పోలీసుల విచారణకు హాజరు కావలసి ఉండగా, ఆయన విచారణకు హాజరుకాకుండా డుమ్మా కొట్టారు. తను సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నానని తనకు నాలుగు రోజుల సమయం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తిలో కోరారు. ఈ మేరకు ఆయన ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ బాబుకు మెసేజ్ చేశారు.

రాజకీయ దురుద్దేశంతోనే తనపై కేసులు
ఇదే సమయంలో హైకోర్టులో వర్మ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. రాజకీయ దురుద్దేశంతో తనపై కేసు నమోదు చేశారని పేర్కొన్న వర్మ తాను ఎవరి పరువుకు భంగం కలిగించేలా పోస్టులు పెట్టలేదని తన బెయిల్ పిటిషన్ లో తెలిపారు. అంతేకాదు ఏ వర్గాల మధ్య శత్రుత్వం పెంచేలాగా తన పోస్టులు పెట్టలేదని వెల్లడించారు.

పోలీసుల కేసుతో క్వాష్ పిటీషన్ వేసిన వర్మ
విచారణకు వెళితే పోలీసులు తనను అరెస్టు చేసి, తన పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని రాంగోపాల్ వర్మ తన పిటీషన్ లో పేర్కొన్నారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన ధర్మాసనాన్ని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికే రాంగోపాల్ వర్మ హైకోర్టులోకి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తను అరెస్టు కాకుండా ఉత్తర్వులు ఇవ్వాలని తనపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు.

కోర్టు షాక్ ఇవ్వటంతో మళ్ళీ ముందస్తు బెయిల్ పిటీషన్
అయితే రాంగోపాల్ వర్మ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం వర్మ అరెస్టు కాకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది కావాలంటే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుంటే విచారణ జరుపుతామని హైకోర్టు పేర్కొంది. దీంతో రాంగోపాల్ వర్మ ప్రస్తుతం ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసి ఆ బెయిల్ పిటిషన్ లో సంచలన ఆరోపణ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+