ఏపీ లక్కీ, చెవిటివాళ్లే పవన్‌ని ఆలస్యంగా అర్థం చేసుకుంటారు: వర్మ, 'పవర్' 'స్టార్' అంటే

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రజలు పవన్ కళ్యాణ్‌ను కలిగి ఉన్నందుకు చాలా లక్కీ అని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఆయన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో శుక్రవారం నాడు పవన్ కళ్యాణ్ గురించి ట్వీట్ చేశారు.

పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకునేందుకు చెవిటి వాళ్లకు చాలా సమయం తీసుకుంటుందని, అతని మేథస్సును వారు ఆలస్యంగా ఆర్థం చేసుకుంటారని ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ వంటి వ్యక్తిని కలిగి ఉన్నందుకు నవ్యాంధ్ర ప్రజలు చాలా లక్కీ అన్నారు.

జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా విషయమై మూడు దశల్లో ఉద్యమిస్తానని గత శనివారం తిరుపతిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ ఉద్యమాన్ని అర్థం చేసుకునేందుకు చెవిటి వాళ్లకు సమయం పడుతుందని వర్మ ఎద్దేవా చేశారు.

ఆయన వరుస ట్వీట్లు చేశారు. ఆ రోజు (తిరుపతి బహిరంగ సభలో) పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాన్ని ఆద్యంతం వింటే అతను సమస్యను చాలా లోతుగా అర్థం చేసుకున్నట్లుగా అర్థమవుతోందని వర్మ అభిప్రాయపడ్డారు. మూడు దశల్లో ఉద్యమిస్తానన్న పవన్ కరెక్ట్ అని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ వంటి స్వచ్ఛమైన నాయకుడు లేడని అభిప్రాయపడ్డారు. అసలు పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానమే ఆయన పవర్ అన్నారు. అలాగే అతని సిన్సియారిటీ ఓ స్టార్ అన్నారు. తద్వారా పవర్ స్టార్‌కు ఓ కొత్త డెఫినేషన్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+