రజనీకాంత్ ప్రకటన-పవన్ కళ్యాణ్‌పై తీవ్రవ్యాఖ్యలు: వర్మ సూచన, మహేష్ కత్తి ఘాటుగా

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్/అమరావతి: సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీని పెడతానని, ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటన చేశారు. ఆయనకు చాలామంది శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అన్నాడీఎంకే, డీఎంకే, బీజేపీ.. ఇలా అన్ని పార్టీల నాయకులు ఆయన రాజకీయ ఆరంగేట్రాన్ని స్వాగతించారు.

  Rajini On Jayalalithaa : జయలలిత ముఖ్యమంత్రి అయితే దేవుడు కూడా తమిళనాడును రక్షించలేడు

  చిరంజీవి నేర్పిన పాఠం: రజనీకాంత్-పవన్.. ఇద్దరి దారి ఒక్కటే, అవే విమర్శలు

  రజనీకాంత్ రాజకీయ పార్టీ పెడతానని, తమిళనాడులోను 234 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కొందరు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నారు. వివాదాస్పద దర్శకులు రామ్ గోపాల్ వర్మ మొదలు ఇటీవల పవన్ కళ్యాణ్ పేరుతో ఇమేజ్ సంపాదించుకున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న కత్తి మహేష్ వరకు స్పందించారు.

  ఫోటో ఎఫెక్ట్, దిమ్మతిరిగే షాక్: మహేష్ కత్తిపై హైపర్ ఆది మరో 'జబర్దస్త్' పంచ్'

   రజనీని పవన్ ఆదర్శంగా తీసుకోవాలి

  రజనీని పవన్ ఆదర్శంగా తీసుకోవాలి

  తలైవా రాజకీయాల్లోకి రావడం ఈవెంట్ ఆఫ్ ది సెంచరీ అని రామ్ గోపాల్ వర్మ అన్నారు. పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఆయన మార్గంలో నడిచి, అన్ని స్థానాల్లో పోటీ చేయాలని హితవు పలికారు.

   ఫేస్‌బుక్ పోస్ట్

  ఫేస్‌బుక్ పోస్ట్

  రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం ఈ శతాబ్ధపు అత్యున్నత ఘటన అని, రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పే సందర్భంలో రజనీ స్క్రీన్ పైన కనపించే సూపర్ స్టార్ కన్నా వెయ్యిరెట్లు ప్రభావితంగా కనిపించారని పేర్కొన్నారు. తమిలనాడులో అన్ని స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పిన తలైవా ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని పీకే (పవన్ కళ్యాణ్) ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

   పవన్ గురించి మళ్లీ స్పందన

  పవన్ గురించి మళ్లీ స్పందన

  రజనీకాంత్ రాజకీయ ఆరంగేట్రంపై మహేష్ కత్తి కూడా స్పందించారు. నిత్యం పవన్ కళ్యాణ్‌ను అదేపనిగా విమర్శించడం ద్వారా మహేష్ కత్తి పాపులర్ అయ్యారని చాలామంది భావిస్తున్నారు. అందుకు తగినట్లే ఆయన పవన్ గురించి వరుసగా స్పందిస్తున్నారు.

   పవన్ కళ్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్య

  పవన్ కళ్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్య

  మహేష్ కత్తి తన సామాజిక అనుసంధాన వేదిక ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టారు. పార్టీ పెట్టి పోటీ చేయ్యకుండా ఇంట్లో కూర్చుంటే పిరికిపంద అంటారు అని రజనీకాంత్ పేర్కొన్నారని, మా రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అంటామే అని పేర్కొన్నారు. '"పార్టీ పెట్టి పోటీ చెయ్యకుండా ఇంట్లో కూర్చుంటే 'పిరికిపంద' అంటారు"-హీరో రజనీ కాంత్, అరె... మా స్టేట్ లో పవన్ కళ్యాణ్ అంటామే!!!' అని మహేష్ పోస్ట్ చేశారు. తద్వారా ఆయన పవన్ అభిమానులకు ఆగ్రహం కలిగేలా తీవ్ర వ్యాఖ్య చేశారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Ram Gopal Varma and Mahesh Kathi comments on Pawan Kalyan after Rajinikanth political entry announcment.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి