Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తలకు రూ. కోటి: ఏపీ డీజీపీకి రాంగోపాల్ వర్మ ఫిర్యాదు, చంద్రబాబు, పవన్‌కు సూటి ప్రశ్న

అమరావతి: సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ డీజీపీని కలిశారు. తన నరికిన వారికి కోటి రూపాయలు ఇస్తానంటూ వ్యాఖ్యలు చేసిన అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావుపై డీజీపీకి ఫిర్యాదు చేశారు రాంగోపాల్ వర్మ. కాగా, ఆర్జీవీ తెరకెక్కించిన 'వ్యూహం' చిత్రం డిసెంబర్ 29న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సినిమా రిలీజ్ గురించి కొలికపూడి శ్రీనివాసరావు ఓ మీడియా ఛానల్‌లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సమాజానికి తన సినిమాలతో కంటకంగా మారిన డైరెక్టర్ ఆర్జీవీ (రాంగోపాల్ వర్మ) తల నరికి వస్తే కోటి రూపాయలు బహుమతి ఇస్తానని శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో రాంగోపాల్ వర్మ మంగళవారం ట్విట్టర్ వేదికగా ఆ వీడియోను జత చేసి ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఈ విషయంపై ఆర్జీవీ బుధవారం ఏపీ డీజీపీ కార్యాలయానికి వెళ్లారు.

 Ram Gopal Varma meets ap dgp and complaints on kolikapudi srinivasa rao

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొలికపూడి శ్రీనివాసరావుపై డీజీపీకి ఆర్జీవీ ఫిర్యాదు చేశారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆర్జీవీ మాట్లాడుతూ.. ఒక టీవీ డిబేట్‌లో కొలికపూడి శ్రీనివాస్ నన్ను చంపడానికి సుపారి ఇచ్చారు. ఆ డిబేట్‌ని కొనసాగించింది అంటే అది యాజమాన్యం తప్పు. ఆ మాటలు తప్పు అని కూడా ఎవరూ ఖండించలేదు. ఎప్పుడూ నన్ను చంపడానికి ఎవరూ సుపారి ఇవ్వలేదు. అందుకే ఇప్పటి వరకు నేను ఫిర్యాదు చేయలేదు అని రాంగోపాల్ వర్మ తెలిపారు.

అంతకుముందు ట్విట్టర్ వేదికగా ఆర్జీవీ తనదైన శైలిలో స్పందించారు. 'కొలికపూడి నన్ను చంపేందుకు కాంట్రాక్ట్ ఇచ్చాడు. యాంకర్ సాంబశివరావు అతడికి తెలివిగా సాయం చేశాడు. నా హత్యకు సంబంధించి కొలికపూడి చేసిన వ్యాఖ్యలను 3 సార్లు పునరావృతం చేసేలా వ్యవహరించాడు' అని ట్వీట్ చేశారు రాంగోపాల్ వర్మ.

మరో ట్వీట్‌లో కొలికపూడి శ్రీనివాసరావుతోపాటు యాంకర్ సాంబశివరావు, సదరు ఛానెల్ యజమాని బీఆర్ నాయుడుపై ఫిర్యాదు చేయనున్నట్లు ఆర్జీవీ పేర్కొన్నారు. చివరకు నిర్మాత దాసరి కిరణ్ కుమార్ తో కలిసి బుధవారం సాయంత్రం విజయవాడలోని డీజీపీ ఆఫీసుకు వెళ్లి.. కొలికపూడి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మరోవైపు, కొలికపూడి వ్యాఖ్యలను చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఖండించలేదని.. అతని వ్యాఖ్యలకు మీరు సానుకూలమా? అని ప్రశ్నించారు వర్మ.

కాగా, వ్యూహం సినిమాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో రంగం ఫేమ్ అజ్మల్ నటించారు. 2009లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత నుంచి వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి అయ్యే వరకు జరిగిన చాలా విషయాలను ఈ సినిమాలో ఆర్జీవీ చూపించారు. అయితే, ఈ సినిమాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాత్రలను అభ్యంతకరంగా చిత్రీకరించారని టీడీపీ, జనసేన అభిమానులు మండిపడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+