వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లక్ష్మీదేవికి అంబానీపైనే ఎందుకో అంతప్రేమ?: రాంగోపాల్ వర్మ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎప్పుడూ ఏవో వివాదాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. అప్పుడప్పుడు సరదా వ్యాఖ్యలు కూడా చేస్తుంటారు. దీపావళి పర్వదినం సందర్భంగా ట్విట్టర్ ద్వారా తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.

ఈసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీపై ట్వీట్ గుప్పించాడు. 'అమ్మవారు లక్ష్మీదేవిని పూజించే వాళ్లు ఎంతో మంది ఉండగా.. ముఖేష్ అంబానీనే ఆమె ఎక్కువగా ప్రేమిస్తుంది ఎందుకో? ప్రత్యేకంగా ఆయనేమైనా ప్రార్థిస్తారా? లేక బయటకు చెప్పటానికి వీలుకాని 'డీల్' ఏదైనా వారి మధ్య ఉందా?' అంటూ సరదాగానో లేక వ్యంగ్యంగానో వర్మ తన ట్వీట్ లో ప్రశ్నించారు.

ram gopal varma on Diwali

అంతేగాక, దీపావళి అందరికీ సంపద తెచ్చి పెట్టాలని అన్నారు. అయితే, భారీగా టపాసులు పేల్చి ఇతరులకు ఇబ్బందులు కలిగించే వారికి అన్ హ్యాపీ దివాలీ అంటూ వ్యాఖ్యానించారు.

టపాసులు భారీ ఎత్తున కొనుగోలు చేసేకంటే స్వీట్స్, తదితర తినుబండరాలు కొనుగోలు చేసి తినేయాలని సూచించారు. ఎవ్వరైనా తమకే చాలా సంపద కావాలని కోరుకుంటారు గానీ, ఇతరులకు ఒక్క రూపాయి ఇవ్వాలనీ కోరుకోరని అన్నారు.

English summary
Cine Director Ram Gopal Varma responded on Diwali celebrations through twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X