వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజమౌళిని అడగండి: అకున్ సబర్వాల్ లీకులపై వర్మ ప్రశ్న

దర్శకులు రాజమౌళి బాహుబలి 3 సినిమా తీస్తాడేమో అని అన్నానని, ఈ ప్రశ్నను ఆయననే అడగాలని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దర్శకులు రాజమౌళి బాహుబలి 3 సినిమా తీస్తాడేమో అని అన్నానని, ఈ ప్రశ్నను ఆయననే అడగాలని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు.

శనివారం తన అకౌంట్ ద్వారా డ్రగ్స్ కేసు విచారణను వర్మ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. బాహుబలి 3 సినిమా తీస్తే అకున్ సబర్వాల్ బాహుబలి అంటూ వెటకారం ప్రదర్శించారు.

సినీ పరిశ్రమలోని వారి పాత్ర లేనప్పుడు డ్రగ్స్‌ అన్నవి అసలు లేనేలేనట్లు కనిపిస్తోందని, పరిశ్రమనే టార్గెట్‌గా చేసుకోవడంలో కుట్ర ఏదైనా ఉందా అని, ఎటువంటి ఆధారాలూ లేకపోయినా, సిట్‌ సభ్యులను, వారి కుటుంబ సభ్యులను అవమానకరంగా పరేడ్‌ చేయిస్తే వాళ్లు ఎలా ఫీలవుతారని, ప్రజల మనసులను కలుషితం చేయకుండా తమ విధులను ఎలా నిర్వర్తించాలనే విషయంలో మరింత సెన్సిటివ్‌గా ఉండాలని అకున్ సబర్వాల్, ఆయన బృందానికి విజ్ఞప్తి చేస్తున్నానని వర్మ పేర్కొన్నారు.

Ram Gopal Varma says aks Rajamouli about Bahubali 3

డ్రగ్స్‌ కేసు విచారణలో మీడియాకు లీకులపై అకున్‌ సభర్వాల్‌ స్పందించాలని కోరారు. డ్రగ్స్‌ కేసులో ఎక్సైజ్ శాఖ వ్యవహరిస్తున్న తీరును, మీడియా ప్రచారాన్నీ ఆయన తూర్పారబట్టారు.

తన శిష్యుడు, దర్శకుడు పూరి జగన్నాథ్‌ను, నటుడు సుబ్బరాజును సుదీర్ఘంగా విచారించడాన్ని ఆయన ప్రశ్నించారు.

ఇదిలా ఉండగా, డ్రగ్ కేసులో రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యల పట్ల అబిడ్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు రిటైర్డ్ ఎక్సైజ్ అధికారుల సంఘం అధ్యక్షులు తెలిపారు.

విధి నిర్వహణలో ఉన్న‌ అకున్‌‌పై వర్మ వ్యాఖ్యలు చేశార‌ని, ఆయన వ్యాఖ్య‌లు శిక్షార్హమేన‌న్నారు. ఎక్సైజ్‌ యాక్ట్‌ ప్రకారం రామ్ గోపాల్ వ‌ర్మ అధికారులను బెదిరించేలా మాట్లాడారని పేర్కొన్నారు.

English summary
Ram Gopal Varma stirred up a hornet's nest with his comments on the ongoing investigation into the drug scam by the Hyderabad police. While IAS officer R V Chandravadan has lashed out at the filmmaker for his 'insensitive comments,' the Movie Artistes Association (MAA) too distanced itself from RGV's remarks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X