ట్రంప్ మూర్ఖుడా, అమెరికన్లా: రామ్ గోపాల్ వర్మ
ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ.. తన దృష్టిని శుక్రవారం నాడు అమెరికా వైపు మళ్ళించారు. డొనాల్డ్ ట్రంప్ వారం రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై వరుసగా ట్వీట్లు చేసిన ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ.. తన దృష్టిని శుక్రవారం నాడు అమెరికా వైపు మళ్ళించారు. డొనాల్డ్ ట్రంప్ వారం రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించారు.
తాజాగా, వర్మ ఆసక్తికర ట్వీట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్‌ను ఎన్నుకున్నందుకు అమెరికన్లు పెద్ద ఇడియెట్లా లేక ఇడియెట్లకు అధ్యక్షుడు అయినందుకు డొనాల్డ్ ట్రంప్ పెద్ద ఇడియెటా అని ట్వీట్ చేశారు.

తాను ఇప్పుడే.. డొనాల్డ్ ట్రంప్‌తో డేవిడ్ మూయిర్ చేసిన ఇంటర్వ్యూను చూసి దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొన్నారు. ఇంత మూర్ఖుడిని అమెరికా అధ్యక్షుడిగా ఎలా ఎన్నుకున్నారో తెలియడం లేదన్నారు. మూర్ఖులు ఎవరో తెలియడం లేదన్నారు.












Click it and Unblock the Notifications