పుట్టినరోజు నాడు వదళ్లేదు : బాబు కు ఆర్జీవి సెటైర్ విషెస్ : లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎఫెక్టా..!
రాజకీయ విబేధాలు మరిచి పుట్టిన రోజు నాడు అందరూ చంద్రబాబుకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కానీ, ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ శైలి మాత్రం వేరు. ఆయన కూడా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కానీ, అందులో ఆయన తన దైన శైలిలో సెటైరికల్‌గా అభినందనలు చెప్పారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల ఎఫెక్ఠ్ ఏంటో ఆర్జీవి చంద్రబాబు బర్త్‌డే నాడు ఇలా చూపించారు..
చంద్రబాబుకు ప్రముఖుల శుభాకాంక్షలు..
69వ పుట్టిన రోజు జరుపుకుంటున్న ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు. ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ నరసింహన్ నేరుగా చంద్రబాబుకు ఫోన్ చేసి విషెస్ చెప్పారు. వైసిపి అధినేత జగన్..టిఆర్‌యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం తమ ట్విట్టర్ ఖాతాల ద్వారా చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పారు. వీరందరికీ చంద్రబాబు సైతం రీ ట్వీట్ చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. అయితే, చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పిన వారిలో ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ సైతం ఉన్నారు. ఆయన కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆలా నేరుగా చెప్పి ఉంటే ఇబ్బంది లేదు. ఆర్జీవి తనదైన శైలిలో సెటైరికల్‌గా చంద్రబాబుకు విషెస్ చెప్పారు. దీంతో..ఆయన ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు పైన ఇలా ట్వీట్ చేసారని..పుట్టిన రోజు నాడు కూడా ఆర్జీవి..చంద్రబాబును వదళ్లేదనే చర్చ మొదలైంది.

ఆర్జీవి ట్వీట్ లో ఏముందంటే..
ఏ వెరీ హ్యాపీ బర్త్‌డే టు @NCBN ప్రపంచంలోనే అత్యంత విధేయత..నిజాయితీ వ్యక్తి..అంటూ ట్వీట్ రాం గోపాల్ వర్మ ట్వీట్ చేసారు. సాధారణంగా బర్త్‌డే విషెస్ చెప్పి ఉంటే ప్రత్యేకత ఏమీ లేదు. కానీ, కొంత కాలంగా టిడిపి నేతలు.. రాం గోపాల్ వర్మ మధ్య లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా గురించి మాటల యుద్దం నడుస్తోంది. ఇందులోని ఒక పాట సైతం పూర్తిగా చంద్రబాబును ఉద్దేశించి తీసారంటూ టిడిపి నేతలు కోర్టును ఆశ్రయించారు. ఇక, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఏపిలో విడుదల కాకుండా ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. ఇలా..ఆ సినిమా విడుదలకు అడ్డుగా మారిన టిడిపి నేతలపై ఆర్జీవి ఆగ్రహంగా ఉన్నారు. దీనికి కొనసాగింపుగా చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షల సమయంలోనూ ఆర్జీవి పరోక్షంగా తన తన ఆగ్రహాన్ని బయట పెట్టారు.












Click it and Unblock the Notifications