'కమ్మ'గా 'కాపు' కాసే శక్తి పవన్ కళ్యాణ్: వర్మ, అలాకాదని వివరణ
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన ప్రముఖ వివాదాస్పద దర్శకులు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు పవన్ కళ్యాణ్ పైన ఎంతో విశ్వాసం ఉందని ఆయన వరుస ట్వీట్లలో అభిప్రాయపడ్డారు.
తెలుగు ప్రజలు అందరినీ కాపు కాసే శక్తి పవన్ కళ్యాణ్‌కు ఉందని, ఆ స్థాయికి ఎదుగుతాటని తాను బలంగా నమ్ముతున్నానని ట్వీట్ చేశారు. చాలా కమ్మగా కాపు కాసే శక్తి ఉన్నటువంటి నాయకుడి లాంటివారు పవన్ కళ్యాణ్ అన్నారు.

ఆ తర్వాత మరో ట్వీట్లో ఆయన కమ్మగా పైన వివరణ ఇచ్చారు. కమ్మగా అంటే తన ఉద్దేశ్యం తీయగా అని, కానీ కమ్మ - కాపులను ఉద్దేశించి కాదని పేర్కొన్నారు. అలా ఆలోచించే వారికి నేను ఈ సమాధానం చెబుతున్నానని పేర్కొన్నారు.
కాగా, రామ్ గోపాల్ వర్మ.. వంగవీటి రంగా సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఓ పాటలో కాపు, కమ్మ కులాల ప్రస్తావన ఉంది. దీంతో తాజాగా పవన్ కళ్యాణ్ పైన వర్మ చేసిన వ్యాఖ్యలు చర్చనీయంగా మారాయి. వర్మ కామెంట్స్‌లో కమ్మ, కాపు పేర్లు ప్రస్తావనకు రావడం గమనార్హం. అయితే, తదుపరి ట్వీట్లోనే వర్మ వివరణ ఇచ్చారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications