Vyooham teaser: ఊహించని క్యారెక్టర్లను పరిచయం చేసిన ఆర్జీవీ

అమరావతి: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రాబోతోన్న లేటెస్ట్ మూవీ.. వ్యూహం. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలను కథాంశంగా చేసుకుని తెరకెక్కుతోందీ సినిమా. దాసరి కిరణ్ కుమార్ దీన్ని నిర్మిస్తోన్నారు. ఇదివరకు వంగవీటి సినిమాను నిర్మించింది ఆయనే. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపుదిద్దుకుంటోంది. వైఎస్ జగన్ పాత్రను తమిళ నటుడు అజ్మల్‌ పోషిస్తోన్నాడు. వైఎస్ భారతి క్యారెక్టర్‌లో మానస రాధాకృష్ణన్ నటిస్తోన్నారు. వ్యూహం సినిమాకు సంబంధించిన పలు వర్కింగ్ స్టిల్స్‌ను రామ్ గోపాల్ వర్మ.. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేస్తూ వచ్చారు.

Ram Gopal Varmas Vyooham movie teaser out

ఈ సినిమా షూటింగ్.. విజయవాడ, గుంటూరు పరిసరాల్లో శరవేగంగా సాగుతోంది. పలు ప్రాంతాల్లో సినిమాను తెరకెక్కిస్తోంది చిత్రం యూనిట్. వైఎస్ జగన్ పాదయాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. ఇందులో వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల పాత్రలను తాజాగా రామ్ గోపాల్ వర్మ పరిచయం చేశారు. వైఎస్ జగన్, భారతి, విజయమ్మ, షర్మిల పాత్రధారులు పాల్గొన్న సన్నివేశాలను షూట్ చేశారు.

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు రామ్ గోపాల్ వర్మ. ఈ ఉదయం సరిగ్గా 11 గంటలకు టీజర్ లింక్‌ను తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. 2009లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన నల్లమల అడవులను చూపించడంతో టీజర్ ఆరంభమౌతుంది.

వైఎస్ జగన్, భార్య వైఎస్ భారతి, తల్లి విజయమ్మ, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్.. ఇలా అన్ని ప్రధాన పాత్రలూ ఈ టీజర్‌లో కనిపించాయి. ఊహించని విధంగా మెగాస్టార్ చిరంజీవి పాత్రను కూడా పరిచయం చేశారు రామ్ గోపాల్ వర్మ. ఓ సన్నివేశంలో చిరంజీవి, నాగబాబు, అల్లు అరవింద్ పాత్రలు సైతం కనిపిస్తాయి.

వైఎస్సార్ హఠాన్మరణం ఉమ్మడి రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం, రాష్ట్ర విభజన.. వంటి సున్నిత అంశాల.. ఈ 2:15 నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్‌లో కట్ చేశారు. ప్రతిపక్ష హోదాలో జగన్ చేసిన నిరాహార దీక్షలు, అక్రమ కేసులతో జైలు జీవితాన్ని గడపడం వంటివీ ఇందులో ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+