హైదరాబాద్ - విజయవాడ మధ్య ‘ఫ్లై 91’ విమాన సర్వీసులు, గల్ఫ్ కు ప్రత్యేకంగా..!!
హైదరాబాద్ - విజయవాడ ప్రయాణీకులకు గుడ్ న్యూస్. ప్రాంతీయ విమానయాన సంస్థ ఫ్లై 91 (Fly 91) తన నూతన సర్వీసులను తెలుగు రాష్ట్రాల మధ్య అధికారికంగా ప్రారంభించింది. ఫ్లై 91 సంస్థ తన కార్యకలాపాలను విస్తరించింది. అదే విధంగా పశ్చిమాసియాలో యుద్ధంతో గల్ఫ్‌లో చిక్కుకుపోయిన తెలుగువారు స్వదేశానికి రావడానికి కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. ఫ్లై 91 కొత్త సర్వీసులను మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు.
ఫ్లై 91 విమాన సర్వీసులను కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నుంచి వర్చువల్‌గా పచ్చజెండా ఊపి ఈ సర్వీసును ఈరోజు ప్రారంభించారు. తక్కువ ధరలో వేగవంతమైన ప్రయాణాన్ని అందించడమే ఈ సంస్థ ప్రధాన ఉద్దేశ్యం. దేశవ్యాప్తంగా టైర్-2, టైర్-3 నగరాలను అనుసంధానించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రాంతీయ కనెక్టివిటీని పెంచడం ద్వారా సామాన్యులు కూడా విమానం ఎక్కాలన్న ప్రధానమంత్రి కల నిజమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడ - హైదరాబాద్ మధ్య రద్దీ దృష్ట్యా ఈ సర్వీస్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రోడ్డు మార్గంలో సుమారు 5 నుంచి 6 గంటల సమయం పట్టే ప్రయాణం, విమానం ద్వారా కేవలం 50 నిమిషాల నుంచి గంటలో పూర్తవుతుంది. హైదరాబాద్‌లో ఐటీ రంగం, విజయవాడలో వ్యాపార రంగాలు బలంగా ఉన్న నేపథ్యంలో, ఈ విమాన సర్వీస్ వ్యాపారవేత్తలకు ప్రయోజనకరంగా మారనుంది.

గల్ఫ్ దేశాలకు ప్రత్యేక విమాన సర్వీసులు
ఫ్లై 91 అనేది గోవా కేంద్రంగా పనిచేస్తున్న ఒక ప్రాంతీయ విమానయాన సంస్థ. ఇది ప్రధానంగా తక్కువ దూరం ఉండే నగరాల మధ్య సర్వీసులను నడుపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో తమ నెట్‌వర్క్‌ను పెంచుకోవడం ద్వారా ప్రయాణికులకు మరిన్నిసౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. కాగా.. పశ్చిమాసియాలో యుద్ధంతో గల్ఫ్‌లో చిక్కుకుపోయిన తెలుగువారు స్వదేశానికి రావడానికి కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. యుద్ధానికి రెండు వారాల పాటు విరామం లభించడంతో సౌదీ అరేబియాలోని దమ్మమ్ నుంచి, విజయవాడ మధ్య రిలీఫ్ ఫ్లైట్స్ నడపడానికి జజీరా ఎయిల్‌లైన్స్ సిద్ధమైంది. ఈనెల 13 నుంచి 29 వరకు ఆ ప్రత్యేక సర్వీసులు నడపనుంది. ఈ మేరకు విజయవాడ విమానాశ్రయ అధికారులకు సమాచారం ఇవ్వటంతో పాటు స్లాట్‌ను బుక్ చేసుకుంది. సోమ, బుధ, శుక్రవారాల్లో ఆ విమానాలు నడుస్తాయి. ఎయిర్‌పోర్టు అధికారులకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం విజయవాడ, దమ్మమ్‌ల మధ్యనే విమానాలు నడు యి. దమ్మమ్‌కు చేరాక అక్కడి నుంచి కువైట్‌కు కూడా ఈ సర్వీసులు వెళ్లనున్నాయి.












Click it and Unblock the Notifications