చంద్రబాబు.. జగన్.. బోయపాటి.. స్కంద!

స్కంద సినిమా మొదట విడుదల కావాల్సిన తేదీ వేరు.. విడుదలైన తేదీ వేరే. ఈ రెండింటి మధ్య రెండు వారాల గ్యాప్ ఉంది. 'సలార్‌' సినిమా వాయిదా పడటంతో లాంగ్‌ వీకెండ్‌ కోసం అక్కడకు వచ్చేశారు. అయితే దీనికి సంబంధించి బయట జరుగుతున్న ప్రచారం వేరు.. సినిమా యూనిట్ అనుకున్న విషయం వేరు అని తెలుస్తోంది. సినిమాలో ఉన్న కొన్ని పొలిటికల్ డైలాగులకు కత్తెర వేసే క్రమంలోనే వాయిదా పడిందని తెలుస్తోంది.

ఈ సినిమాలో దర్శకుడు బోయపాటి శ్రీను కొన్ని పొలిటికల్‌ డైలాగ్‌లు పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న కొన్ని పథకాల్లో ఉన్న డొల్లతనాన్ని ఎత్తిచూపేలా ఆ డైలాగులున్నాయి. సినిమాను తొలి రోజు చూసినవారు చాలామంది ఇదే మాట చెప్పారు. అయితే అవి కొన్నేనని, చాలా డైలాగులున్నప్పటికీ తీసేశారని చెబుతున్నారు.

ram pothineni and boyapati srinu latest movie skandha latest update

వాస్తవానికి ఈ డైలాగువల్ల స్కంద సినిమాను ఓ రాజకీయపార్టీ ఓన్ చేసుకునే అవకాశం ఉండేది. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను కూడా సినిమాలో విడమరిచి చెప్పారు. అయితే ఆ పార్టీ అధినేత అనుకోని పరిస్థితుల్లో జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండటంతో కుదరలేదు. అందుకే ఈ సినిమాలోని డైలాగులు, దాని ఎఫెక్ట్ వంటి అంశాలను ఈ హడావిడిలో పార్టీ పట్టించుకోలేదని, లేదంటే ఇంకోరకంగా ఉండేదంటున్నారు.

దర్శకుడు బోయపాటి శ్రీను తెలుగుదేశం పార్టీ మద్దతుదారు అనే ప్రచారం ఉంది. ఆ పార్టీకి అనుబంధంగా గతంలో కొన్ని వీడియోలు కూడా రూపొందించారు. అలాగే రామ్ బంధువులు కొందరు టీడీపీలో ఉన్నారంటారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో రామ్ బంధువుల ఆస్పత్రిలో జరిగిన వివాదం అందరికీ తెలిసిందే. ఆ పార్టీ అధినేత జైల్లో ఉండటంవల్ల బోయపాటి, రామ్ కాంబినేషన్ లో వచ్చిన స్కందలో రాజకీయ డైలాగులను ఆ పార్టీ ఓన్ చేసుకునే పరిస్థితి మారిపోయిందంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+