అందుకే చిరంజీవి అలా అడిగారు: సిఆర్, కెసిఆర్‌కు థ్యాంక్స్
హైదరాబాద్: కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ నాయకుడు సి. రామచంద్రయ్య తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును ప్రశంసించారు. ఏడాది పాలనలో హైదరాబాదులోని ఆంధ్రులను మంచిగా చూసుకున్నారని అంటూ ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
అదే సమయంలో తమ పార్టీ నాయకుడు చిరంజీవి రాష్ట్ర విభజన సమయంలో చేసిన డిమాండ్‌ను గుర్తు చేశారు. హైదరాబాదులో సమస్యలు రాకూడదనే చిరంజీవి హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం (యుటి)గా చేయాలని అడిగారని ఆయన అన్నారు. కాంగ్రెసు వల్లనే పునర్విభజన చట్టంలో లోపాలు చోటు చేసుకున్నాయని కూడా రామచంద్రయ్య బుధవారంనాడు అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంతం కోసమే మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ఆత్మరక్షణలో పడ్డారని అందుకే మంత్రులు అలా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబుపై మరో కాంగ్రెసు నాయకుడు శైలజానాథ్ కూడా మండిపడ్డారు. స్వీయ ప్రయోజనం కోసం చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నవ్యాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్, కేసీఆర్ కుట్ర చేస్తున్నారని టీడీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర విమర్శించారు.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications