జగన్ తప్పు చేశారు, ఇప్పటికైనా మారాలి: రామకృష్ణ డిమాండ్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతి అభ్యర్థిత్వం విషయంలో తప్పు చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం స
ప్రకాశం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతి అభ్యర్థిత్వం విషయంలో తప్పు చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం సరైన నిర్ణయం కాదని చెప్పారు.
జగన్ ఇప్పటికైనా.. సెక్యూలర్ పార్టీల అభ్యర్థి మీరా కుమార్‌కు మద్దతివ్వాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యమున్న రామ్ నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతి చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.

కాగా, ఎన్డీఏ అభ్యర్థికే తాము మద్దతు పలుకుతామని వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పదవి గౌరవం కాపాడేందుకు రాష్ట్రపతి అభ్యర్థికి పోటీ పెట్టవద్దని కూడా ఆయన కోరారు. కాగా, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కేసీఆర్‌లు కూడా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు పలికారు.












Click it and Unblock the Notifications