ఫ్యాక్షన్‌కు, ఫ్యాషన్‌కు అర్థాలు తెలియవు: రామసుబ్బారెడ్డి ఆసక్తికరం
కడప: తెలుగుదేశం పార్టీ కడప జిల్లా సీనియర్ నేత, మాజీ మంత్రి రామసుబ్బా రెడ్డి ఆదివారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్యాక్షన్‌కు, ఫ్యాషన్‌కు అర్థాలేమిటో తనకు తెలియవని రామసుబ్బా రెడ్డి వ్యాఖ్యానించారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణ రెడ్డి కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆదినారాయణ చేరికను రామసుబ్బా రెడ్డి మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
అయితే, ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సర్ది చెప్పడంతో రామసుబ్బా రెడ్డి... ఆదినారాయణ చేరిక పైన అసంతృప్తితో అయినా స్వాగతించారు. అయితే తనకు టిడిపిలో గౌరవం ఉన్నంత వరకే ఉంటానని ఆ సమయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా, మరోసారి ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. కలిసిపోదామని ఓవైపు చెబుతూనే, మరోవైపు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న ఆదినారాయణ రెడ్డి మనస్సు మారాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అధినాయకులకు తెలియకుండానే గ్రామాల్లో కొన్ని సంఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయన్నారు.
అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. సుదీర్ఘకాలంగా రాజకీయ వైరం ఉన్న రామసుబ్బా రెడ్డి, ఆదినారాయణరెడ్డిలు ప్రస్తుతం టిడిపిలోనే ఇమిడిపోయారు. ఈ క్రమంలో ఆదినారాయణ రెడ్డి వైఖరిపై ఒకింత అసహనం వ్యక్తం చేసిన రామసుబ్బా రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ... ఆసక్తకర వ్యాఖ్యలు చేశారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications