RRR Gold coins: ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి రామ్ చరణ్ స్పెషల్ గిఫ్ట్‌లు
హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ నటుడు రాంచరణ్ తేజ్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాంచరణ్ తేజ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. భారతీయ చలన చిత్ర రికార్డులను తిరగరాస్తోంది.

ఆర్ఆర్ఆర్ టీంకు గోల్డ్ కాయిన్స్ గిఫ్గ్‌గా ఇచ్చిన రాంచరణ్
ఈ నేపథ్యంలో రాంచరణ్ తన సినిమా కోసం పనిచేసిన వారికి తగిన గౌరవం ఇవ్వాలని తలిచారు. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం పని చేసిన వివిధ శాఖలకు చెందిన వారికి ఊహించని బహుమతి అందించారు రాంచరణ్. సినిమా కోసం పని చేసిన వివిధ విభాగాల అధిపతులను, కెమెరా అసిస్టెంట్లను, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్లను, మేనేజర్లను, అకౌంటెంట్లను, స్టిల్ ఫోటోగ్రాఫర్ అసిస్టెంట్లను ఇలా దాదాపు అన్ని విభాగాలకు చెందిన సుమారు 35 మందికి బంగారు నాణేలు కానుకగా ఇచ్చారు రాంచరణ్.

బంగారు నాణేలు ఇచ్చి సంతోషం పంచుకున్న రాంచరణ్
సినిమా కోసం పని చేసినందుకు వారందరికీ రాంచరణ్ ధన్యవాదాలు తెలిపారు. సినిమా ఇంత అద్భుతంగా రావడంలో వారి పాత్ర కూడా ఉందని ఈ సందర్భంగా రామ్ చరణ్ వారందరినీ అభినందించారు. సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించిన సందర్భంగా రామ్ చరణ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సంతోషాన్ని అందరితో పంచుకోవాలనే రాంచరణ్.. వారందరికీ బంగారు నాణేలు ఇచ్చి సత్కరించారు. సుమారు 10 గ్రాముల బంగారు నాణేలను వారందరికీ ఇచ్చారు రాంచరణ్. ఈ నాణేనికి ఓ వైపు ఆర్ఆర్ఆర్, మరోవైపు రాంచరణ్ పేర్లు రాసివున్నాయి.

సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్న ఆర్ఆర్ఆర్
ఎన్టీఆర్-రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్'.. బాక్సాఫీస్ వద్ద రూ.వెయ్యి కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే అనేక రికార్డులను బ్రేక్ చేసిన ఈ సినిమా.. మరో అరుదైన ఘనత దక్కించుకుంది. ప్రముఖ టికెట్ బుక్సింగ్స్ సంస్థ బుక్‌మై షోలో అత్యధిక రేటింగ్ పొందిన చిత్రంగా నిలిచింది 'ఆర్ఆర్ఆర్'. 90శాతం రేటింగ్‌తో 5.55 లక్షలకు పైగా ఓట్లను సాధించింది.

వెయ్యి కోట్ల దిశగా ఆర్ఆర్ఆర్
కాగా, ఇప్పటికే 700 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్.. 1000 కోట్ల వైపు దూసుకుపోతుంది. తారక్ ను కొమురం భీమ్ గా.. రామ్ చరణ్ ను అల్లూరి సీతారామరాజు గా చూపించిన జక్కన్న ప్రేక్షకుల చేత ఇప్పటికీ శబాష్ అనిపించుకుంటూనే ఉన్నారు. విడుదలై వారం రోజులు కావస్తున్నా.. కలెక్షన్ల జోరు మాత్రం తగ్గలేదు. మరికొన్ని రోజులు కూడా ఇలాగే కొనసాగితే మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం లేకపోలేదు.












Click it and Unblock the Notifications