Ramcharan:ఐపీఎల్ ఫ్యాన్స్ కు చెర్రీ "మెగా" న్యూస్ - ప్రైడ్ ఆఫ్ ఆంధ్రా..!?
ప్రస్తుతం ఐపీఎల్ మేనియా కొనసాగుతోంది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగుతున్న ఐపీఎల్ మజా ఆస్వాదిస్తున్న వేళ హీరో రాం చరణ్ "మెగా" గుడ్ న్యూస్ చెప్పారు. సినీ హీరోగా..సక్సెస్ ఫుల్ బిజినెస్ పర్సన్ గా కంటిన్యూ అవుతున్న రాం చరణ్ క్రికెట్ వ్యాపారంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే పది టీంలు ఐపీఎల్ లో తల పడుతున్నాయి. మరో టీంను క్రియేట్ చేసి..ఐపీఎల్ బరిలోకి దిగేందుకు రాం చరణ్ సిద్దం అవుతున్నారు. ఏపీ పేరుకు ఐపీఎల్ లో ఇప్పటి వరకు టీం లేదు. కొత్తగా రాం చరణ్ ఫ్రాంచైజీగా కొత్త టీం సిద్దం అవుతోంది.
క్రికెట్ వ్యాపారంలో రాంచరణ్ : వచ్చే ఏడాది ఐపీఎల్ నుంచి క్రికెట్ వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు హీరో రాం చరణ్ సిద్దం అవుతున్నట్లు సమాచారం. ఇప్పటి తెలుగు రాష్ట్రాల నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ పేరుతో కావ్యా మారన్ ఫ్రాంచైజీగా కొనసాగుతోంది. అప్పటి వరకు 8 జట్లతో ఉన్న ఐపీఎల్ గతేడాది నుంచి కొత్తగా లక్నో, గుజరాత్ టీంల ఎంట్రీతో పదికి చేరాయి.
ఐపీఎల్ కు దేశ వ్యాప్తంగా వస్తున్న క్రేజ్ తో రాం చరణ్ క్రికెట్ బిజినెస్ లో ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. రాంచరణ్ బిజినెస్ లో.. సతీమణి ఉపాసన అపోలో సంస్థల నిర్వహణలో కొనసాగుతున్నారు. మెగాహీరోగా రాంచరణ్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇదే సమయంలో క్రికెట్ వ్యాపారంలో తెలుగు టీంకు ఫ్రాంఛైజీగా వ్యవహరిస్తే ఆ ఫ్యాన్ సపోర్టింగ్ కిక్కే వేరు.

వైజాగ్ వారియర్స్ టీంగా : ఈ టీం కోసం రాం చరణ్ తన డ్రీం టీంను కూడా దాదాపుగా ఫైనల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ముందుగా ఫ్రాంచైజీగా ఎంట్రీ ఇచ్చి..ఐపీఎల్ ఆక్షన్ లో పాల్గొనాలి. ఆ తరువాతనే తన డ్రీం టీంను రాం చరణ్ ఎంపిక చేసుకొనే అవకాశం ఉంటుంది. తన కొత్త టీంకు వైజాగ్ వారియర్స్ పేరు ఖరారు చేసినట్లుగా ప్రచారం సాగుతోంది.
ఐపీఎల్ వ్యాపారం..ఆక్షన్..టీం మేనేజ్ మెంట్ వంటి వ్యవహారాల పైన రాంచరణ్ పూర్తి సమాచారం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. క్రికెట్ అంటే రాంచరణ్ , మిత్రుడు జూ ఎన్టీఆర్‌కు ఇష్టం. గతంలో హైదరాబాద్‌లో టీం ఇండియా ప్లేయర్స్ మ్యాచ్ ఆడటానికి వచ్చిన సమయంలో ప్రత్యేకంగా వీరి ఇంట జరిగిన విందుకు హాజరయ్యారు.

బాలీవుడ్ హీరోలకు పోటీగా : ఈ ఫ్రాంఛైజీకి రాంచరణ్ - జూ ఎన్టీఆర్ భాగస్వాములుగా ఉంటారనే వాదన వినిపిస్తోంది. అయితే, ఇద్దరి జాయింట్ బిజినెస్‌గా వెళ్తారా లేదా అనేది మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కానీ, వచ్చే ఏడాది ఐపీఎల్ ఆక్షన్ టైంకు ముందే కొత్త టీం ఏర్పాటుకు సంబంధించి కసరత్తు జరుగుతున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించి తెలుగు క్రికెట్‌లో దిగ్గజాలుగా వ్యవహరించిన ఇద్దరి సహకారం కూడా తీసుకుంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది.
ఈ న్యూస్‌తో చెర్రీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రచారం సాగుతున్నట్లుగా రాంచరణ్ టీం ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇస్తే..ఇప్పటి వరకు బాలీవుడ్‌కు చెందిన షారూక్ ఖాన్, ప్రీతి జింటా, జూహీ చావ్లా తో పాటుగా రాంచరణ్ పోటీ పడనున్నారు. ఇక విశాఖ కేంద్రంగానూ ఐపీఎల్ మ్యాచ్ లు జరిగే అవకాశం ఉంటుంది. దీని పైన రాం చరణ్ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications