అలా చేస్తే ఏపీకీ హోదా ఖాయం: చంద్రబాబు చేసిన తప్పు చేయద్దు : ఎన్డీఏలోకి జగన్‌కు ఆహ్వానం..!
Recommended Video
ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత జగన్‌ను ఎన్డీఏలో చేరాలని కేంద్ర మంత్రి ఆహ్వానించారు. గతంలో చంద్రబాబు చేసిన తప్పు చేయవద్దని సూచించారు. మోదీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన ఏపీకీ ప్రత్యేక హోదా సాధించుకోవాలని కేంద్ర మంత్రి రాందాస్ అథేవలే మార్గదర్శకం చేసారు. అయితే, ఎన్డీఏలో చేరే విషయం పైన ఇప్పటికే జగన్‌కు ఆహ్వానం వచ్చినా..ఆయన నిర్ణయం తీసుకోలేదు. తాజాగా మరోసారి కేంద్ర మంత్రి సూచన పైన వైసీపీ ఏలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
చంద్రబాబు చేసిన తప్పు చేయద్దు..
ఏపీ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మోదీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించి, ఏపీకి ప్రత్యేక హోదాను సాధించుకోవాలని కేంద్ర మంత్రి రాందాస్ అథేవలే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు సూచించారు. మోదీకి వ్యతిరేకంగా వ్యవహరించవద్దని మాజీ సీఎం చంద్రబాబుకు స్వయంగా చెప్పానని, కానీ ఆయన దేశవ్యాప్తంగా పర్యటించి, సొంతరాష్ట్రంలో ఘోరంగా ఓడిపోయారని అన్నారు.

చంద్రబాబు చేసిన తప్పు చేయొద్దని, మోదీ ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాలని జగన్‌కు ఆయన హితవు పలికారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఇప్పటి వరకు ఏ నిర్ణయమూ తీసుకోలేదని, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక హోదా కావాలని అడుగుతూ ఉండటమే ఇందుకు కారణమన్నారు . అయితే, హోదా విషయంలో గతం కంటే ఒక కేంద్ర మంత్రి ఇలా సానుకూలంగా స్పందించటంతో ఇప్పుడు వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారింది.
జగన్ ఎన్డీఏలోకి వెళ్తారా..
ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత హోదా సాధన కోసం ఎలా ముందుకెళ్తారనేది ఆసక్తి కరంగా ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఎవరి మద్దతు అవసరం లేకుండానే మోదీ ప్రభుత్వం పూర్తి మెజార్టీ సాధించింది. ఇక, వైసీపీ మద్దతు వారికి అవసరం లేదు. ఇదే సమయంలో ఎన్డీఏ మిత్రపక్షంగా ఉండమని జగన్‌కు ఇప్పటికే ఆహ్వానం అందింది. ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఎన్డీఏలో చేరటం వలన లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ప్రత్యేక హాదా పైన ఎటువంటి స్పష్టత ఇవ్వకుండా ఎన్డీఏలో చేరితే టీడీపీ చేతికి అస్త్రం ఇచ్చినట్లువుతుందని భావిస్తున్నారు. ఇక, తనతో కలిసి వచ్చే పార్టీలతో కలిసి మోదీ పైన ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా సాధించటం మినహా జగన్ ముందు మరో ప్రత్యామ్నాయం లేదు. దీంతో..ఆయన ఎన్డీఏలో చేరాలంటే ప్రత్యేక హోదా పైన సానుకూల నిర్ణయం వస్తేనే సాధ్యమని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు.
-
ఉగాది కానుకగా "జాబ్ క్యాలెండర్" రిలీజ్.. ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే..? -
జాబ్ క్యాలెండర్, ఉద్యోగాల భర్తీ పై ప్రభుత్వం కీలక నిర్ణయం...!! -
ఏపీ పోలీసులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు..? -
టిడ్కో ఇళ్లపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-వారికి డబ్బులు రిఫండ్..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..!












Click it and Unblock the Notifications