లక్ష్మీస్ ఎన్టీఆర్: బ్రదర్ అనిల్-వర్మ మధ్య ఏం చర్చ?.. ఇంత విషయముందా?
ఒకవేళ సినిమాలో నిజంగానే ఎన్టీఆర్ జీవితంలో విలన్ ఎవరనేది చూపించినా.. యథార్థానికి జనం దాన్ని అన్వయించుకుంటారని చెప్పలేం. అప్పటిదాకా ఉన్న వారి రాజకీయ దృక్పథాన్ని సినిమా మార్చేస్తుందని చెప్పలేం.
విజయవాడ: ఒక వాస్తవం మరుగునపడిందంటే దాని చుట్టూ అనేకానేక కారణాలు. అది మళ్లీ చర్చకు రాకుండా.. కనీసం దాని ఊసెత్తే ధైర్యం కూడా చేయకుండా కనపడని కర్ఫ్యూ లు వెంటాడుతుంటాయి. అలాంటి అంశాన్ని మళ్లీ తెర పైకి తీసుకురావాలంటే గట్స్ ఉండాలి. అదే సమయంలో వాస్తవాలను వక్రీకరించకుండా జనాలను మెప్పించే దమ్ము ఉండాలి.
దర్శకుడు రాంగోపాల్ వర్మలో ఈ రెండూ ఉన్నప్పటికీ.. ఇక్కడి రాజకీయ నియంత్రణను తట్టుకుని వాస్తవాలను ఎంతమేర ఆయన తెర మీద నిలబెడుతారన్నదే పాయింట్. అలా నిక్కచ్చిగా.. నిర్ద్వంద్వంగా ఆయన ఎన్టీఆర్ సినిమా తీయగలిగితే.. తెలుగునాట ఇప్పట్లో దాన్ని మించిన సంచలనం ఉండదేమో!

రహస్య భేటీ:
నిజానికి తొలుత వర్మ ఎన్టీఆర్ సినిమా తెరకెక్కిస్తున్నారనగానే అంతా కాకతాళీయమే అనుకున్నారు. కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ అని ఆయన ఎప్పుడైతే ఒక పోస్టర్ విడుదల చేశారో.. అప్పటినుంచి సినిమా రాజకీయ రంగు పులుముకోవడం మొదలైంది. దాని నిర్మాత వైసీపీ నేత రాకేష్ రెడ్డి అని తెలిశాక.. ఈ చర్చ మరింత తీవ్రమైంది.
టీడీపీ నుంచి వర్మకు అప్పుడే హెచ్చరికలూ మొదలయ్యాయి. ఇన్నాళ్లు ఎవరూ కదపని తుట్టెను వర్మ పెల్లగించాలని చూడటం వారిని ఒకరకమైన ఆందోళనలోకి నెట్టెస్తోంది. ఇలాంటి తరుణంలో.. వైసీపీ అధినేత జగన్ కు స్వయానా బావ అయిన బ్రదర్ అనిల్ కుమార్ తో వర్మ రహస్యంగా భేటీ అవడం సినిమాపై మరిన్ని అనుమానాలకు తావిచ్చింది.

వైసీపీ డైరెక్షన్‌లో?:
సినిమాను వర్మ వైసీపీ డైరెక్షన్‌లో నడిపించబోతున్నారా? అన్న అనుమానాలకు బ్రదర్ అనిల్ కుమార్‌తో భేటీ ఊతమిచ్చింది. వర్మ-అనిల్ మధ్య దేనిపై చర్చ జరిగిందో స్పష్టమైన వివరాలు లేకపోయినప్పటికీ.. సినిమా గురించే చర్చించి ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. బ్రదర్ అనిల్ తనవద్ద ఓ స్టోరీ లైన్ తో తమసోమా జ్యోతిర్గమయా అనే సినిమా తీద్దామని వర్మతో చెప్పినట్లు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

జగన్ ప్లాన్ ప్రకారమేనా?:
ఇటీవల జగన్ చిన్నజీయర్ స్వామిని కలవడం పలు చర్చలకు తావిచ్చింది. ఆయన హిందువులకు దగ్గరవాలనే ప్రయత్నాల్లో భాగంగానే ఆయనతో భేటీ అయినట్లు వార్తలు వచ్చాయి. ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో జగన్ తన వ్యూహాలకు పదునుపెడుతూ ఓ పద్దతి ప్రకారమే ముందుకెళ్తున్నట్లు అర్థమవుతోంది.
ఇందులో భాగంగానే బ్రదర్ అనిల్ కుమార్ కూడా 'తమసోమా జ్యోతిర్గమయా' అనే టైటిల్ తో సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నారన్న అనుమానం కూడా రాకమానదు. ఆ ప్రయత్నం హిందువులను ఆకట్టుకోవడానికే అన్న సంకేతాలను పంపిస్తోంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ తో ప్రత్యర్థికి చెక్ పెడుతూనే.. బ్రదర్ అనిల్ సినిమాతో హిందూ ఓటు బ్యాంకును టార్గెట్ చేస్తున్నారన్న అన్న చర్చ జరుగుతోంది.

వర్మపై సీక్రెట్ నిఘా:
ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే.. సినిమా తీస్తున్నా అని ప్రకటించినప్పటి నుంచి వర్మపై టీడీపీ సీక్రెట్ నిఘా కొనసాగుతుందనే విషయం అర్థమవుతోంది. వర్మతో బ్రదర్ అనిల్ భేటీ అంశం కూడా టీడీపీ అనుకూల మీడియాకే ఎక్స్ క్లూజివ్ సమాచారం అందడం దీనికి బలం చేకూరుస్తోంది. సినిమాపై వర్మ ఆలోచనలు, ఆయన్ను ప్రభావితం చేస్తున్న వ్యక్తుల కదలికలపై నిఘా గట్టిగానే కొనసాగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

అందుకే భయం:
వర్మ గనుక ఎన్టీఆర్ జీవితంలోని కఠిన వాస్తవాలను తెర మీద ఆవిష్కరిస్తే.. అది ఎవరిని గురిపెడుతుందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కథను లక్ష్మీ పార్వతి వైపు నుంచి చెప్పాలనుకున్న ఆయన కోణం కూడా ప్రతినాయకుడి పాత్ర ఎవరనే దానిపై స్పష్టత ఇచ్చేసింది. కాబట్టే ప్రత్యర్థి వర్గం ఉలికిపడుతోంది.
ఇన్నాళ్లు లోకల్ మీడియాను తమ నియంత్రణలో పెట్టుకుని ఎన్టీఆర్ జీవితంలోని దుర్భర పరిస్థితులపై పెద్దగా ఫోకస్ లేకుండా చేసిన వర్గానికి.. వర్మ ఇప్పుడు దాన్ని 7ఎంఎంపై ఫోకస్ చేయాలనుకోవడం మింగుడుపడటం లేదు. అంతులేని అభద్రతా భావం నుంచే వర్మకు వారి నుంచి హెచ్చరికలు జారీ అవుతున్నట్లు అర్థమవుతోంది.

సినిమా ప్రభావమెంత?:
అదీగాక, సరిగ్గా ఎన్నికల వాతావారణం సమీపిస్తున్న తరుణంలోనే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్లాన్ చేయడం కూడా చర్చలకు తావిస్తోన్న అంశం. ఎన్నికలకు ముందు ఈ సినిమా విడుదలైతే దీని తాలుకు ప్రభావం ఎంతో కొంత జనంపై పడకపోదు. ఈ విషయమే టీడీపీని అభద్రతా భావానికి లోను చేస్తోంది. అయితే జనం సినిమా చూసొచ్చి.. తమ ఓటు నిర్ణయాన్ని మార్చుకుంటారా? అన్నది ఆలోచించాల్సిన విషయం.
ఒకవేళ సినిమాలో నిజంగానే ఎన్టీఆర్ జీవితంలో విలన్ ఎవరనేది చూపించినా.. యథార్థానికి జనం దాన్ని అన్వయించుకుంటారని చెప్పలేం. అప్పటిదాకా ఉన్న వారి రాజకీయ దృక్పథాన్ని సినిమా మార్చేస్తుందని చెప్పలేం. కాబట్టి టీడీపీ అనవసరంగా అభ్రతా భావానికి లోనై.. ఎన్టీఆర్ జీవితంలో తామే విలన్ అన్న సంకేతాలను జనాల్లోకి పంపిస్తున్నట్లు కనిపించకమానదు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications