‘‘నాతోనే పోర్న్ సినిమా తీస్తానన్న రామ్ గోపాల్ వర్మను అరెస్టు చేసి జైలుకు పంపాలి..’’

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమాజంలో ఉండదగిన మనిషి కాదని, ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబునాయుడు స్పందించి అతడ్ని అరెస్టు చేసి జైలుకు పంపించాలని ‘ఐద్వా’ రాష్ట్ర అధ్యక్షురాలు మణి డిమాండ్ చేశారు.

అమరావతి: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమాజంలో ఉండదగిన మనిషి కాదని, ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబునాయుడు స్పందించి అతడ్ని అరెస్టు చేసి జైలుకు పంపించాలని 'ఐద్వా' రాష్ట్ర అధ్యక్షురాలు మణి డిమాండ్ చేశారు.

ఓ చానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మణి మాట్లాడుతూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యానించారు. తక్షణం, రామ్ గోపాల్ వర్మను అరెస్టు చేసి, ఈ సమాజంలో మహిళను కించపరిచే వారికి ఓ మెస్సేజ్ ఇవ్వాలని ఆమె కోరారు.

మహిళా సంఘాలకు వర్మ భయపడ్డారా?

మహిళా సంఘాలకు వర్మ భయపడ్డారా?

ముందుగా ప్రకటించిన ప్రకారం జనవరి 26న అంటే శుక్రవారం విడుదల అవాల్సిన ‘గాడ్ సెక్స్ ట్రూత్'.. కొన్ని సాంకేతిక కారణాల వల్ల విడుదల చేయలేకపోయినట్లు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మహిళా సంఘాల విమర్శలకు భయపడే వర్మ ఈ వెబ్ సిరీస్‌ను విడుదల చేయలేదనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

వర్మను అరెస్టు చేసి జైలుకు పంపాలి...

వర్మను అరెస్టు చేసి జైలుకు పంపాలి...

మరోవైపు ‘గాడ్ సెక్స్ ట్రూత్' వెబ్ సిరీస్‌పై ఓ చానల్‌లో చర్చ జరుగుతుండగా.. ‘ఐద్వా' రాష్ట్ర అధ్యక్షురాలు మణిపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మణి స్పందించారు. ‘నాతో పోర్న్ సినిమా తీస్తానని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పబ్లిక్‌గా చెప్పారు, ఆడవాళ్లను కించపరిచే వాళ్ల తాట తీస్తామని ఈపాటికే ప్రభుత్వం ఒక ప్రకటన చేసి ఉంటే బాగుండేది.. ఇప్పటికైనా వర్మను అరెస్టు చేసి జైల్లో కూర్చోబెట్టాలి..' అని అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వాలు ఎవరివైపు ఉన్నాయి?

ప్రభుత్వాలు ఎవరివైపు ఉన్నాయి?

‘అసలు ఈ వ్యవస్థదే లోపం. వ్యవస్థ వల్లే వ్యక్తులు తయారవుతారు. వ్యక్తుల వల్ల వ్యవస్థ నాశనం కాదు. ఈ వ్యవస్థే పెట్టుబడిదారీ వ్యవస్థ. లాభం కోసం ఎంతకైనా దిగజారతారు. పోర్న్, చైల్డ్ పోర్న్ తీస్తారు, వ్యభిచారాన్ని చట్టబద్ధం చేస్తారు, తాగుడిని ప్రోత్సహిస్తారు, లాభం కోసం ఎంతకైనా దిగజారే ఈ వ్యవస్థ మారితే గానీ, ఆడవాళ్లు కోరుకునే మంచి సమాజం రాదు..' అని మణి ఆవేశంగా చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వాలు మహిళలవైపు ఉన్నాయో.. లేక రామ్ గోపాల్ వర్మ లాంటి దిగజారుడు మనిషుల వైపు ఉన్నాయో తేల్చి చెప్పాలని ‘ఐద్వా' మణి డిమాండ్ చేశారు.

మా అమ్మానాన్న ఇచ్చిన రూపమిది...

మా అమ్మానాన్న ఇచ్చిన రూపమిది...

నిజంగా, మహిళల సెక్స్ స్వేచ్ఛ కోసమే రామ్ గోపాల్ వర్మ గారు మాట్లాడుతున్నట్టయితే.. దుస్తులు ధరించిన మహిళలను చూపించవచ్చని మణి అన్నారు. ‘నేను అందంగా ఉండనని, అసలు, నేను, ఆడదానినా? కాదా? అని కూడా వర్మ ప్రశ్నించారు. నేను అందంగా ఉండటం, ఉండకపోవడమనేది వర్మకు సంబంధించిన విషయం కాదు. మా అమ్మానాన్న నాకు ఇచ్చిన రూపమిది..' అని మణి వ్యాఖ్యానించారు.

ఉత్తరాంధ్ర ఆడవాళ్లంతా నాలాగే ఉంటారు...

ఉత్తరాంధ్ర ఆడవాళ్లంతా నాలాగే ఉంటారు...

తాను ఉత్తరాంధ్రకు చెందిన ఒక మామూలు ఆడదానినని, ఉత్తరాంధ్ర బాగా వెనుకబడిన ప్రాంతమని.. ఇంటి బాధ్యతలు చూసుకునే, కాయకష్టం చేసే ఇక్కడి ఆడవాళ్లందరూ తనలాగే ఉంటారని మణి చెప్పుకొచ్చారు. అందంగా ఉన్న ఆడవాళ్లను ఒకలాగ, అందంగా లేని ఆడవాళ్లను ఒకలాగ చూడకూడదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యతారహితంగా మాట్లాడే రామ్ గోపాల్ వర్మను తక్షణమే అరెస్టు చేసి జైల్లో కూర్చోబెట్టాలని మణి డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+