బలమైన నేరారోపణ శక్తి: దేవినేని నెహ్రూ మృతిపై వర్మ కామెంట్!..

అందరిలా సానుభూతి ప్రకటించడం కాకుండా.. వర్మ తనదైన మార్క్ కనిపించే కామెంట్ చేశారు.

హైదరాబాద్: సోమవారం ఉదయం తెల్లవారుజామున కన్నుమూసిన దేవినేని నెహ్రూ మరణ వార్త చాలామందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. తాజాగా వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆయన మృతిపై తనదైన శైలిలో స్పందించారు.

అందరిలా సానుభూతి ప్రకటించడం కాకుండా.. తనదైన మార్క్ కనిపించే కామెంట్ చేశారు. 'నెహ్రూ మరణం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయనతో నేను గడిపిన అద్భుత సమయాన్ని గుర్తు చేసుకుంటున్నా. బలమైన నేరారోపణలతో కూడిన శక్తికి ఆయన చిహ్నం' అంటూ రాంగోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

Ramgopal varma tweets on Devineni Nehru's death

కాగా, దేవినేని నెహ్రూ, వంగవీటి రంగా శత్రుత్వం నేపథ్యంలో ఇటీవలే వర్మ 'వంగవీటి' చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇందులో రంగాను విలన్ తరహాలో చూపించారని ఆరోపిస్తూ రెండు రోజుల క్రితం వంగవీటి రాధా విజయవాడ కోర్టులో వర్మపై క్రిమినల్ కేసు దాఖలు చేశారు. ఇంతలోనే దేవినేని మృతి చెందడం బెజవాడలో కలకలం రేపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+